New Zealand election results: ఒక్క సీటు తేడాతో మారిన న్యూజిలాండ్ రాజకీయ సమీకరణాలు..
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్ ఎన్నికల ఫలితాలు అక్కడి రాజకీయాల్లో ఉత్కంఠకు తెరలేపాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ ఏ కూటమికీ దక్కకపోవడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ నేతృత్వంలోని అధికార కూటమి మెజారిటీ మార్కుకు కేవలం ఒక్క సీటు దూరంలో నిలిచింది. దీంతో ప్రభుత్వాన్ని కొనసాగించాలంటే మరో పార్టీ మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివరాలు
న్యూజిలాండ్ పార్లమెంటులో మొత్తం 130 స్థానాలు
న్యూజిలాండ్ పార్లమెంటులో మొత్తం 130 స్థానాలు ఉన్నాయి. వీటిలో అధికార నేషనల్ పార్టీ 40 సీట్లను గెలుచుకుంది.
ఆ పార్టీతో కలిసి కూటమిలో ఉన్న ఏసీటీ పార్టీకి 13, న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీకి 12 స్థానాలు దక్కాయి.
దీంతో అధికార కూటమి మొత్తం బలం 65కు చేరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి మరో ఒక్క సీటు కావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఆపర్చునిటీ పార్టీ మద్దతు అధికార కూటమికి కీలకంగా మారింది.
ఆ పార్టీతో ఒప్పందం కుదరకపోతే దేశంలో మరోసారి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి రావచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వివరాలు
లేబర్ పార్టీకి 36 స్థానాలు,న్స్ పార్టీ 17 సీట్లు
మరోవైపు లేబర్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది.
లేబర్ పార్టీకి 36 స్థానాలు రాగా, గ్రీన్స్ పార్టీ 17 సీట్లను గెలుచుకుంది.
మావోరీ ప్రజల హక్కులు, ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే టె పాతి మావోరీ పార్టీకి ఐదు స్థానాలు దక్కాయి.
ఈ పార్టీలన్నింటినీ కలిపినా మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం లేదు.
ఆపర్చునిటీ పార్టీ మద్దతు లభించినప్పటికీ ప్రతిపక్ష కూటమి మెజారిటీని చేరుకోవడం సాధ్యం కాదని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
వివరాలు
ఒప్పందాన్ని కుదుర్చుకుని, అది విఫలమైతే ప్రజలకు ఇబ్బంది
ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ స్పందించారు.
ఇతర పార్టీలతో జరిపే చర్చలు కొంత క్లిష్టంగా ఉండవచ్చని, తుది ఒప్పందానికి రావడానికి సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు.
తొందరపాటుతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని, అది విఫలమైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడినా ప్రజలు దాన్ని స్వాగతించకపోవచ్చని వ్యాఖ్యానించారు.
మరోవైపు లేబర్ పార్టీ నాయకుడు క్రిస్ హిప్కిన్స్ తమ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని సమర్థంగా నిర్వహించిందని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలని కోరుకునే వారి కంటే మార్పు రావాలని ఆశించినవారి సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
వివరాలు
ఆపర్చునిటీ పార్టీ మద్దతుపైనే అందరి దృష్టి
ఈ ఎన్నికల్లో ఆపర్చునిటీ పార్టీకి ఏడు స్థానాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీ నాయకురాలు క్యూలే వాంగ్ కీలక పాత్ర పోషించనున్నారు.
నేషనల్ పార్టీతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె వెల్లడించారు.అయితే ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు.
దేశానికి స్థిరమైన ప్రభుత్వాన్ని అందించడం అన్ని రాజకీయ పార్టీల బాధ్యత అని ఆమె అభిప్రాయపడ్డారు.
న్యూజిలాండ్‌లో మిక్స్‌డ్ మెంబర్ ప్రొపోర్షనల్(ఎంఎంపీ)ఎన్నికల విధానం అమల్లో ఉంది.
ఈపద్ధతిలో ఓటర్లు రెండు ఓట్లు వేస్తారు.మొదటి ఓటును తమకు నచ్చిన రాజకీయ పార్టీకి,రెండో ఓటును తమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి వేస్తారు.
ఈ విధానం ద్వారా పార్లమెంటులో పార్టీలకు లభించే మొత్తం ప్రాతినిధ్యం నిర్ణయిస్తారు.ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు వివరించారు.
వివరాలు
ప్రత్యేక ఓట్ల లెక్కింపుతో మారిన ఫలితాలు
నవంబర్ 7న పోలింగ్ ముగిసిన వెంటనే వెల్లడైన ప్రాథమిక ఫలితాల్లో అధికార కూటమికి స్వల్ప ఆధిక్యం కనిపించింది.
అయితే విదేశాల్లో ఉన్న న్యూజిలాండ్ పౌరులు, తమ నియోజకవర్గాలకు వెలుపల ఉన్న ఓటర్లు వేసిన ప్రత్యేక ఓట్లను లెక్కించిన తర్వాత పరిస్థితి మారిపోయింది.
ఈ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక అధికార కూటమి ఖాతాలో రెండు సీట్లు తగ్గాయి. దీంతో మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం మరింత దూరమైంది.
సాధారణంగా ఈ తరహా ప్రత్యేక ఓట్లు వామపక్ష పార్టీలకు ఎక్కువగా అనుకూలిస్తాయని ఎన్నికల విశ్లేషణలు చెబుతున్నాయి.
ఎన్నికల ప్రచారంలో నేషనల్ పార్టీ పలు కీలక హామీలను ప్రజల ముందుంచింది.
వివరాలు
జీవన వ్యయం, నిరుద్యోగంతో ప్రజల్లో ఆందోళన
పన్నులు తగ్గించడం,విద్యుత్ ధరలను అందుబాటులోకి తీసుకురావడం,పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడం,దేశ రక్షణ రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలను తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించింది.
ఈ హామీలతో ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించింది.
అయితే ఈ ఎన్నికల్లో ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసిన అంశాలు జీవన వ్యయం, నిరుద్యోగం. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటం, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, రాజకీయ నాయకులపై నమ్మకం సన్నగిల్లడం వంటి సమస్యలపై ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్థిక పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపినట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి.
వివరాలు
జీవన వ్యయం, నిరుద్యోగంతో ప్రజల్లో ఆందోళన
హెలెన్ క్లార్క్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలోనూ దేశ పరిస్థితులపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నట్లు వెల్లడైంది.
సర్వేలో పాల్గొన్న వారిలో సగానికి పైగా ప్రజలు న్యూజిలాండ్‌ను అవకాశాలు మెరుగ్గా లభించే దేశంగా చూడటం లేదని తేలింది.
మరోవైపు దేశం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య రికార్డు స్థాయికి చేరినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
మాజీ ప్రధాని జసిండా ఆర్డెర్న్ సహా పలువురు న్యూజిలాండ్ పౌరులు ఆస్ట్రేలియాకు వలస వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ పరిణామాలన్నీ దేశంలో నెలకొన్న ఆర్థిక, సామాజిక పరిస్థితులపై చర్చకు దారితీస్తున్నాయి.
ప్రస్తుతం ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితి తొలగాలంటే పార్టీల మధ్య చర్చలు కొలిక్కి రావాల్సి ఉంది.