LOADING...
Trump: చేతిలో తుపాకీతో ట్రంప్.. ఇరాన్‌కు చివరి హెచ్చరిక

Trump: చేతిలో తుపాకీతో ట్రంప్.. ఇరాన్‌కు చివరి హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటైన హెచ్చరికలు చేశారు. అణు కార్యక్రమంపై దౌత్యపరమైన పరిష్కారం త్వరలో కుదరకపోతే అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇరాన్ తెలివిగా వ్యవహరిస్తే మంచిదని సూచించారు. ఈ సందర్భంగా తుపాకీ పట్టుకున్న తన ఫొటోను 'ట్రూత్ సోషల్' వేదికలో పంచుకున్న ట్రంప్, ఇకమీదట మంచోడిగా ఉండను అంటూ వ్యాఖ్యానించారు. చర్చల విషయంలో ఇరాన్ సరైన విధంగా ముందుకు రావడం లేదని విమర్శించారు. అణు ఒప్పందం ఎలా కుదుర్చుకోవాలో వారికి స్పష్టత లేదని తెలిపారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో,అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా ప్రతిపాదనలను తిరస్కరిస్తే మరింత దూకుడుగా, కఠినంగా వ్యవహరిస్తామని ట్రంప్ హెచ్చరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తుపాకీ ఫొటోతో ట్రంప్ సందేశం

Advertisement