Loading...
Sheikh Hasina: విమానం వద్దు.. కాలినడకనే బంగ్లాదేశ్‌కు హసీనా!
విమానం వద్దు.. కాలినడకనే బంగ్లాదేశ్‌కు హసీనా!

Sheikh Hasina: విమానం వద్దు.. కాలినడకనే బంగ్లాదేశ్‌కు హసీనా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చేందుకు వచ్చే నెల 16న విమానం పంపించాలని మాజీ ప్రధాని షేక్‌ హసీనా చేసిన విజ్ఞప్తిని భారత ప్రభుత్వం తిరస్కరించినట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. దీంతో ఆమె కాలినడకన భారత సరిహద్దు దాటి స్వదేశంలోకి అడుగుపెడతారని పేర్కొంటున్నారు. సరిహద్దు వద్ద హసీనాకు స్వాగతం పలికేందుకు, అక్కడి నుంచి ఢాకా వరకు మానవహారంగా నిలిచేందుకు లక్షలాది మంది సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. స్వదేశానికి వెళ్లేందుకు మరో మార్గం లేకపోతే హసీనా భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దును కాలినడకన దాటుతారని ఆమె అనుచరుడు అబూ ఒబైదా అరిన్‌ ఓ బ్రిటిష్‌ వార్తా సంస్థకు తెలిపారు.

వివరాలు

గోపాల్‌గంజ్‌లో మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు నిలిపివేత

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా సొంత జిల్లా గోపాల్‌గంజ్‌లో అధికారులు శుక్రవారం నుంచి మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలను నిలిపివేశారు.

హసీనా స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదే కారణంతో గోపాల్‌గంజ్‌ జిల్లాలో ఈనెల 15 నుంచి రైల్వే సేవలను కూడా నిలిపివేశారు. ఈ నిలిపివేతను నిరవధికంగా కొనసాగించనున్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు.

వచ్చే నెల 16న స్వదేశానికి తిరిగి రానున్నట్లు హసీనా ప్రకటించినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈనెల 15న తొలుత గోపాల్‌గంజ్‌ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకోవడంతో పాటు ఇళ్లకు నిప్పుపెట్టిన ఘటనలు కూడా జరిగాయి.

ADVERTISEMENT