Page Loader
Nobel Prize: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌
Nobel Prize: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

Nobel Prize: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2024
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

అర్థశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతిని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను ముగ్గురికి ఈ పురస్కారం అందించనుంది. దేశాల మధ్య సంపదలో అసమానతలపై పరిశోధనలు చేసిన డారెన్‌ ఏస్‌మోగ్లు, సైమన్‌ జాన్సన్, జేమ్స్‌ ఎ. రాబిన్‌సన్‌ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. వైద్యవిభాగంతో ప్రారంభమైన నోబెల్‌ పురస్కారాల ప్రకటన ఈ రోజుతో ముగిసింది. గత సోమవారం వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించిన తర్వాత, వరుసగా భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, సాహిత్యం విభాగాల్లో కూడా పురస్కారాలను ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నోబెల్ టీం చేసిన ట్వీట్ 

వివరాలు 

ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులు ప్రదానం 

శుక్రవారం రోజున నోబెల్‌ శాంతి బహుమతి (Nobel Peace Prize 2024)పై ప్రకటన చేయగా, తాజగా అర్థశాస్త్రంలో ముగ్గురు ఆర్థికవేత్తల పేర్లను ప్రకటించారు. డారెన్‌, సిమోన్‌ అమెరికాలోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందినవారు, షికాగో యూనివర్సిటీలో జేమ్స్‌ రాబిన్‌సన్ పరిశోధనలు చేస్తున్నారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త,ఇంజినీర్‌,వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా, ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించడంతో, 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్‌ నగదు అందిస్తుంది. డిసెంబర్‌ 10న నిర్వహించే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డులను అందజేయనున్నారు.