
Nobel Peace Prize 2025: మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) వెనెజువెలాకు చెందిన ప్రజాస్వామ్య హక్కుల పోరాటాయోధురాలు మరియా కొరీనా మచాడో (Maria Corina Machado)ని ప్రకటించింది. ఈ నిర్ణయం నార్వేలోని నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. మచాడో , తన దేశ ప్రజల హక్కుల కోసం నిరంతరంగా శాంతిపూర్వక పోరాటం చేసినందుకు ఈ అత్యున్నత పురస్కారం అందుకున్నారు. ఇక ఈ సంవత్సరంలో, ఈ బహుమతికి మొత్తం 338 మంది అభ్యర్ధులు నామినేట్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కూడా ఈ బహుమతికి తన అభ్యర్థిత్వం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, కమిటీ మరియా కొరీనా మచాడో పట్ల తమ మద్దతును వ్యక్తం చేశారు.
వివరాలు
పార్లమెంట్ సభ్యురాలిగా, ప్రధాన విపక్ష నాయకురాలిగా సేవలు అందించిన మచాడో
మచాడో నియంతృత్వ వ్యవస్థను ఎదుర్కొని ప్రజాస్వామ్య సాధన కోసం శాంతిపూర్వక మార్గంలో చేసిన కృషి విశేషమైనదని నోబెల్ అకాడమీ సభ్యులు పేర్కొన్నారు. ఆమె తన దేశంలోని ప్రజల హక్కుల కోసం అనేక సంవత్సాలుగా పోరాడుతూ, బెదిరింపులు, ఒత్తిడులు ఎదుర్కొన్నారు. గత ఏడాది కాలంగా ఆమె అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చింది. మచాడో వెనెజువెలా పార్లమెంట్ సభ్యురాలిగా, ప్రధాన విపక్ష నాయకురాలిగా సేవలందించారు. దేశంలోని సైనికీకరణ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, శాంతిపూర్వక మార్గంలో ప్రజాస్వామ్య సాధన కోసం చేసిన కృషితో ఆమె వందల మందికి ప్రేరణనిచ్చారు.
వివరాలు
త్యల్ప వయసులో నోబెల్ అందుకున్న మలాలా యూసఫ్‌జాయ్
1901 నుండి ఇప్పటివరకు నోబెల్ శాంతి బహుమతిని 105 సార్లు ప్రకటించారు. ఇందులో 111 మంది వ్యక్తులు, 31 సంస్థలు ఈ గౌరవాన్ని పొందినట్లు రికార్డులో ఉంది. అత్యధిక వయసులో ఈ అవార్డును అందుకున్న వ్యక్తి జోసెఫ్ రాట్‌బ్లాట్ (Joseph Rotblat) 86 ఏళ్ల వయసులో కాగా, అత్యల్ప వయసులో పొందినది పాకిస్థాన్ హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ (Malala Yousafzai).