Loading...
Nobel Peace Prize: ట్రంప్‌కు పోటీగా ఐఎస్‌ఎస్‌.. 2026 నోబెల్ రేసులో ఆసక్తికర పరిణామం..
ట్రంప్‌కు పోటీగా ఐఎస్‌ఎస్‌.. 2026 నోబెల్ రేసులో ఆసక్తికర పరిణామం..

Nobel Peace Prize: ట్రంప్‌కు పోటీగా ఐఎస్‌ఎస్‌.. 2026 నోబెల్ రేసులో ఆసక్తికర పరిణామం..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

2026 నోబెల్ శాంతి బహుమతి రేసు ఈసారి అనూహ్య చర్చలకు వేదికగా మారింది. సాధారణంగా ప్రపంచ రాజకీయ నాయకులు, మానవతావాద సంస్థలు, అంతర్జాతీయ సంస్థల పేర్లు ఈ అవార్డు కోసం వినిపిస్తుంటాయి. అయితే ఈసారి అందుకు భిన్నంగా అంతరిక్షంలో కొనసాగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) పేరు కూడా నిపుణుల అంచనాల్లోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ, పోప్ లియో తదితరులతో పాటు ఐఎస్‌ఎస్‌ కూడా చర్చనీయాంశమైంది. అయితే వీరిలో ఎవరెవరు అధికారికంగా నామినేట్ అయ్యారనే విషయాన్ని నోబెల్ కమిటీ ధ్రువీకరించలేదు. 2026 నోబెల్ శాంతి బహుమతి విజేతను అక్టోబర్ 9న నార్వే రాజధాని ఓస్లోలో ప్రకటించనున్నారు.

వివరాలు 

287 నామినేషన్లు.. అసలు జాబితా మాత్రం బయటకు రాదు

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం అర్హత పొందిన మొత్తం 287 నామినేషన్లు నోబెల్ కమిటీకి అందాయి.

వీటిలో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయి. అయితే నార్వేజియన్ నోబెల్ కమిటీ అధికారిక నామినీల పేర్లను బహిరంగంగా వెల్లడించదు.

సాధారణంగా నిపుణుల అంచనాలు, ప్రిడిక్షన్ మార్కెట్లు, బహిరంగ చర్చల ఆధారంగా కొన్ని పేర్లు ప్రచారంలోకి వస్తుంటాయి.

అలాంటి పేర్లను అధికారిక నామినీలుగా భావించడానికి వీల్లేదు. చివరికి ఎవరికి అవార్డు ఇవ్వాలనే నిర్ణయం నోబెల్ కమిటీదే.

వివరాలు 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎందుకింత ప్రాధాన్యం?

రాజకీయ, భౌగోళిక విభేదాలు కొనసాగుతున్నప్పటికీ వివిధ దేశాలు ఒకే లక్ష్యంతో కలిసి పనిచేయగలవనే భావనకు ఐఎస్‌ఎస్‌ ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

అమెరికా, రష్యా, యూరప్‌, జపాన్‌, కెనడాకు చెందిన వ్యోమగాములు, శాస్త్రవేత్తలు ఈ అంతరిక్ష కేంద్రంలో కలిసి పనిచేశారు.

భౌగోళికంగా, రాజకీయంగా పరస్పరం విభేదించే దేశాలు సైతం శాంతియుతమైన ఉమ్మడి ప్రాజెక్టులో సహకరించగలవని ఐఎస్‌ఎస్‌ నిరూపించింది.

2000 నవంబర్‌ నుంచి ఈ అంతరిక్ష కేంద్రంలో నిరంతరంగా మానవుల ఉనికి కొనసాగుతోంది.

దీంతో ఐఎస్‌ఎస్‌కు ఏదైనా అంతర్జాతీయ గుర్తింపు దక్కితే, దానిని కేవలం శాస్త్రీయ పురోగతికి ఇచ్చిన గౌరవంగా మాత్రమే కాకుండా దేశాల మధ్య సహకారం, శాంతియుత భాగస్వామ్యానికి ప్రతీకగా కూడా చూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ట్రంప్‌ పేరు ప్రచారంలో ఉన్నా.. అవకాశాలపై సందేహాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పేరు కూడా 2026 నోబెల్ శాంతి బహుమతి చర్చల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.

ఈ అవార్డు తనకు దక్కాలని ఆయన గతంలో పలుమార్లు తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

పలువురు రాజకీయ నాయకులు కూడా ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు వెల్లడించారు.

అయితే ఇటీవలి నిపుణుల అంచనాల్లో ట్రంప్‌ గెలిచే అవకాశాలపై అంతగా నమ్మకం కనిపించడం లేదు.

అమెరికా, ఇజ్రాయెల్‌ నేతృత్వంలో ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణ కూడా ఆయనకు ప్రతికూలంగా మారే అంశాల్లో ఒకటిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అయితే ఈ అంచనాలు తుది నిర్ణయాన్ని సూచించవు. విజేతను ఎంపిక చేసే విషయంలో నోబెల్ కమిటీకి పూర్తి స్వతంత్రత ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

కార్నీ, జెలెన్‌స్కీ, పోప్ లియో పేర్లు కూడా..

కెనడా ప్రధాని మార్క్ కార్నీ పేరు కూడా ఈసారి నోబెల్ శాంతి బహుమతి చర్చల్లో కనిపిస్తోంది.

అమెరికా విధించిన సుంకాల విధానాన్ని ఆయన వ్యతిరేకించడం,దేశాల మధ్య అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని కోరడం ఆయన పేరును చర్చలోకి తీసుకువచ్చిన కారణాలుగా చెబుతున్నారు.

అయితే కార్నీనోబెల్ షార్ట్‌లిస్ట్‌లో ఉన్నారనే అధికారిక సమాచారం మాత్రం లేదు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేరు కూడా సంభావ్య విజేతల చర్చలో ఉంది.

ఇదే సమయంలో అమెరికాలో జన్మించిన తొలి పోప్‌గా గుర్తింపు పొందిన పోప్ లియో పేరు కూడా వినిపిస్తోంది.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంపై ఆయన అనేక సందర్భాల్లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

కొన్నివిషయాల్లో ఆయన వైఖరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అభిప్రాయాలకు భిన్నంగా కూడా కనిపించింది.

వివరాలు 

మానవతావాద సంస్థలు, అంతర్జాతీయ న్యాయ సంస్థల పేర్లు

నోబెల్ శాంతి బహుమతి అంచనాల్లో రాజకీయ నాయకులతో పాటు పలు మానవతావాద సంస్థలు, కార్యకర్తల పేర్లు కూడా ఉన్నాయి.

సేవ్ ద చిల్డ్రన్‌, ఉక్రెయిన్‌కు చెందిన బాలల హక్కుల కార్యకర్త మైకోలా కులేబా, సూడాన్‌కు చెందిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ రూమ్స్‌, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్‌ వంటి సంస్థలు, వ్యక్తులు ఈ చర్చలో ఉన్నారు.

అంతర్జాతీయ న్యాయం, జవాబుదారీతనం, యుద్ధాలు మరియు ఘర్షణలను న్యాయపరమైన మార్గాల్లో పరిష్కరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు కూడా ఈసారి ప్రాధాన్యం పెరిగింది.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే), అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) పేర్లు కూడా నిపుణుల అంచనాల్లో కనిపిస్తున్నాయి.

వివరాలు 

మానవతావాద సంస్థలు, అంతర్జాతీయ న్యాయ సంస్థల పేర్లు

ఇలా రాజకీయ నాయకుల నుంచి మానవతావాద సంస్థలు, అంతర్జాతీయ న్యాయ సంస్థల వరకు.. ఈసారి నోబెల్ శాంతి బహుమతి కోసం అనేక భిన్నమైన పేర్లు తెరపైకి వచ్చాయి.

వాటన్నింటిలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పేరు రావడం మాత్రం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అయితే ఇవన్నీ కేవలం అంచనాలు, బహిరంగ చర్చలే తప్ప అధికారిక విజేతల జాబితా కాదు. అసలు విజేత ఎవరన్నది అక్టోబర్ 9న ఓస్లోలో నోబెల్ కమిటీ ప్రకటించిన తర్వాతే స్పష్టమవుతుంది.

ADVERTISEMENT