South Korea: సియోల్ పై ఉత్తర కొరియా 260 బెలూన్ల చెత్తా చెదారం
ఉత్తరకొరియా తమ దేశంపై 260 బెలూన్ల చెత్తా చెదారాన్ని వదిలిందని దక్షిణ కొరియా ఇవాళ తెలిపింది. దీనికి పొరుగు దేశం బాధ్యత వహించాలంది.మంగళవారం రాత్రినుంచి బెలూన్లు వచ్చి పడ్డాయని చెప్పింది. దీంతో ఎవరూ వాటిని తాకరాదని స్ధానిక ప్రజలను దక్షిణ కొరియా సైనిక సంయుక్త సైనికాధికారులు(JCS)హెచ్చరించారు. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే తమను పోలీసులను సంప్రదించాలని కోరింది. చాలా బెలూన్లు దక్షిణ కొరియా ఆగ్నేయ ప్రాంతంలో పడ్డాయని JCS ప్రకటించింది. ఉత్తరకొరియా చేసిన పని అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమేనని JCS అభిప్రాయపడింది. దీని వల్ల తమ పౌరుల భద్రతకు ముప్పు తలెత్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో 1950లలో కొరియా యుద్ధం జరిగినపుడు ఉత్తర,దక్షిణ కొరియాలు తమ ప్రచార కార్యక్రమాలకు ఈ బెలూన్‌లను ఉపయోగించాయి.
బెలూన్‌ల చెత్తా చెదారం తొలగింపుకు సహకారం JCS
"బెలూన్ల నిండా చెత్తా చెదారం నింపి వుందని(JCS) తెలిపింది. దీనికి పూర్తి బాధ్యత ఉత్తర కొరియా వహించాలని హెచ్చరించింది. ఈ చెత్తా చెదారం తొలగించటానికి ప్రభుత్వానికి పూర్తి స్ధాయిలో సహకరిస్తామని JCS ప్రకటించింది. మానవతను మరిచి ఉత్తర కొరియా ఇటువంటి పనులను చేస్తుందని దుయ్య బట్టింది. తక్షణమే ఇటువంటి పనులకు ముగింపు పలకాలని కోరింది.