Loading...
North Korea: ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్న ఉత్తర కొరియా.. మరోసారి బాలిస్టిక్ క్షిపణుల పరీక్ష
బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను ప‌రీక్షించిన ఉత్త‌ర కొరియా

North Korea: ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్న ఉత్తర కొరియా.. మరోసారి బాలిస్టిక్ క్షిపణుల పరీక్ష

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 12, 2026
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర కొరియా తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకునే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా పలు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించినట్లు దక్షిణ కొరియా సైన్యం ఆరోపించింది. ఉత్తర కొరియా తూర్పు సముద్ర జలాల వైపు ఈ క్షిపణులను ప్రయోగించినట్లు వెల్లడించింది. ఇప్పటికే ఉత్తర,దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ కొరియా సంయుక్త దళాల ప్రతినిధి జాంగ్ డో యుంగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ నుంచి పలు రకాల క్షిపణులను ప్రయోగించింది. గత కొన్నేళ్లుగా ఆ దేశం తన ప్రధాన విమానాశ్రయాన్ని కీలక క్షిపణి ప్రయోగ కేంద్రంగా ఉపయోగించుకుంటోంది.

వివరాలు 

17 నిమిషాల వ్యవధిలో రెండు క్షిపణులు

తాజాగా పరీక్షించిన క్షిపణుల్లో ఒకటి సుమారు 900 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు జాంగ్ తెలిపారు.

అయితే, మొత్తం ఎన్ని క్షిపణులను గుర్తించారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.

జపాన్ డిప్యూటీ రక్షణ మంత్రి తకాషి కోయరి తెలిపిన వివరాల ప్రకారం.. 17 నిమిషాల వ్యవధిలో రెండు క్షిపణులను గుర్తించారు.

ఈ క్షిపణులు జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎకనామిక్ జోన్) వెలుపల ఉన్న సముద్ర జలాల్లో పడినట్లు తెలుస్తోంది.

మొదటి క్షిపణి సుమారు 220 కిలోమీటర్లు ప్రయాణించగా.. రెండో క్షిపణి దాదాపు 910 కిలోమీటర్ల దూరం వెళ్లినట్లు జపాన్ అధికారి వెల్లడించారు.

ఈ ప్రయోగాల్లో భాగంగా ఉత్తర కొరియా హైపర్‌సోనిక్ ఆయుధాన్ని పరీక్షించి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

వివరాలు 

అణ్వాయుధ సామర్థ్యంపై ఉత్తర కొరియా దృష్టి

అయితే, ఈ క్షిపణి ప్రయోగాల వల్ల విమానాలు లేదా నౌకలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని స్పష్టం చేశారు.

అణు సామర్థ్యం కలిగిన ఆయుధాలను అభివృద్ధి చేసి, తన సైనిక శక్తిని పెంచుకోవడానికి ఉత్తర కొరియా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలో బాలిస్టిక్ క్షిపణుల పరీక్షలు నిర్వహిస్తోంది. తాజా ప్రయోగాల్లో ఒక క్షిపణి 910 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు జపాన్ వెల్లడించడం, హైపర్‌సోనిక్ ఆయుధ పరీక్ష జరిగి ఉండవచ్చన్న అనుమానాలు ఈ పరిణామంపై మరింత ఆసక్తిని పెంచాయి.

ADVERTISEMENT