Norway: భారత ప్రధానికి నార్వే అత్యున్నత పౌర పురస్కారం
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నార్వే ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్'ను ప్రదానం చేసింది. నార్వేకు తొలిసారిగా వచ్చిన భారత ప్రధానిగా మోదీకి అక్కడి రాజుహెరాల్డ్-5 సోమవారం ఈ గౌరవాన్ని అందజేశారు. మానవాళిసంక్షేమం కోసం విశేష సేవలు చేసిన విదేశీయులు,నార్వే పౌరులను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. మోదీ అందుకున్న అంతర్జాతీయ గౌరవాల్లో ఇది 32వది కావడం విశేషం.ఐదుదేశాల పర్యటనలో భాగంగా మోదీ సోమవారం నార్వే రాజధాని ఒస్లో చేరుకున్నారు. అక్కడ ఆయనకు నార్వే ప్రధానమంత్రి జోనాస్ గాహ్ స్టోర్ ఆత్మీయ స్వాగతం పలికారు.పహల్గాం ఉగ్రదాడి సమయంలో భారత్‌కు నార్వే మద్దతుగా నిలవడంపై ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మోదీకి నార్వే అత్యున్నత పౌర పురస్కారం
STORY | PM Modi receives Norway's highest civilian honour
— Press Trust of India (@PTI_News) May 18, 2026
Prime Minister Narendra Modi was on Monday conferred with Norway's highest civilian honour, the Grand Cross of the Royal Norwegian Order of Merit, for his contribution in advancing the India-Norway relationship and his… pic.twitter.com/il5Zd2XuBF