LOADING...
Khabarovsk: అణు శక్తితో నడిచే 'ఖబారోవ్స్క్' జలాంతర్గామిని ప్రవేశపెట్టిన రష్యా!
అణు శక్తితో నడిచే 'ఖబారోవ్స్క్' జలాంతర్గామిని ప్రవేశపెట్టిన రష్యా!

Khabarovsk: అణు శక్తితో నడిచే 'ఖబారోవ్స్క్' జలాంతర్గామిని ప్రవేశపెట్టిన రష్యా!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2025
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా తాజా అణు సామర్థ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. అణుశక్తితో నడిచే పొసైడన్‌ అణు డ్రోన్‌ వ్యవస్థతో కూడిన కొత్త అణు జలాంతర్గామి "ఖబారోవ్స్క్"ను ఆ దేశం విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ డ్రోన్‌ "డూమ్స్‌డే క్షిపణి"గా ప్రపంచవ్యాప్తంగా పేరుపొందింది, ఎందుకంటే ఇది సముద్ర గర్భంలో సుదూర ప్రాంతాలకు చేరి భయంకర విధ్వంసం సృష్టించే శక్తిని కలిగి ఉంది. సెవ్‌మాష్‌ నౌకానిర్మాణ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో రష్యా రక్షణ మంత్రి ఆండ్రేయ్‌ బెలోవ్‌సోవ్‌ అధికారికంగా ఈ జలాంతర్గామిని ప్రారంభించారు. ఈ సబ్‌మెరైన్‌ నీటి అడుగున సంచరించే ఆధునిక ఆయుధాలు, రోబోటిక్‌ వ్యవస్థలను మోసుకెళ్లగల సామర్థ్యంతో ఉందని ఆయన తెలిపారు. సముద్ర సరిహద్దుల రక్షణతోపాటు ప్రపంచవ్యాప్తంగా రష్యా ప్రయోజనాలను కాపాడటానికి ఇది కీలకంగా ఉపయోగపడుతుందన్నారు.

వివరాలు 

డూమ్స్‌డే క్షిపణి

స్థానిక మీడియా సమాచారం ప్రకారం,ఈ సబ్‌మెరైన్‌లో అణుఇంధనంతో నడిచే పొసైడన్‌ సముద్ర డ్రోన్‌ కూడా అమర్చబడి ఉంది. ఈ డ్రోన్‌ను రష్యా ఇటీవల పరీక్షించిందని నివేదికలు చెబుతున్నాయి. సాధారణ టోర్పిడోలు,ఇతర జలాంతర్గాములకన్నా వేగంగా పయనించగల ఈ డ్రోన్‌ సముద్రంలో అత్యంత లోతు ప్రాంతాల్లో కూడా ఖండాంతర దూరాలు సులభంగా చేరగలదని వివరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇటీవల చేసిన ప్రకటనలో, పొసైడన్‌ డ్రోన్‌ను జలాంతర్గామి నుంచే ప్రయోగిస్తారని తెలిపారు. ఇది సబ్‌మెరైన్‌లో ఉన్న ప్రధాన అణు రియాక్టర్‌ కంటే సుమారు 100 రెట్లు చిన్న పరిమాణంలో ఉన్న రియాక్టర్‌ ద్వారా పనిచేస్తుందని ఆయన వివరించారు. ఈ ఆయుధాన్ని రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్‌ "డూమ్స్‌డే క్షిపణి"గా అభివర్ణించారు .

Advertisement