Page Loader
China: చైనాలోని నర్సింగ్‌ హోమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది మృతి
చైనాలోని నర్సింగ్‌ హోమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

China: చైనాలోని నర్సింగ్‌ హోమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2025
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెంగ్డే నగరంలోని లాంగ్‌హువా కౌంటీలో ఉన్న ఒక నర్సింగ్ హోమ్‌లో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారుల ప్రకారం, రాత్రి సరిగ్గా 9 గంటల సమయంలో నర్సింగ్ హోమ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులు ప్రస్తుతం దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నర్సింగ్‌ హోమ్‌లో భారీ అగ్నిప్రమాదం