LOADING...
Donald Trump: 'ఇక 48 గంటలే మిగిలి ఉన్నాయి'.. ఇరాన్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్
'ఇక 48 గంటలే మిగిలి ఉన్నాయి'.. ఇరాన్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: 'ఇక 48 గంటలే మిగిలి ఉన్నాయి'.. ఇరాన్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2026
09:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మరోసారి ఇరాన్‌ను (Iran) హెచ్చరించారు. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవడానికి లేదా హర్మూజ్‌ జలసంధిని (Strait of Hormuz) మళ్లీ తెరవడానికి ఇచ్చిన పది రోజుల గడువు ముగిసే దశలో ఉందని చెప్పారు. "సమయం మించిపోయింది, ఇక 48 గంటల్లో విధ్వంసం తప్పదు. అంతా భగవంతుడి దయ!" అని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో (Truth Social) పోస్టు చేశారు. ఇప్పటికే, ఇరాన్‌ అమెరికాకు చెందిన ఎఫ్‌-15 యుద్ధవిమానాన్ని (F-15 fighter jet) కూల్చివేశామని ప్రకటించింది.

వివరాలు

గగనతలపై పూర్తి నియంత్రణ ఉంది

ఈ సందర్భంగా ఇరాన్‌ సైన్యం అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను (advanced air defense systems) ఉపయోగించిందని వెల్లడించింది. తమ గగనతలపై పూర్తి నియంత్రణ ఉందని ఇరాన్ సైన్యం స్పష్టంగా పేర్కొంది.

Advertisement