
Israel: ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి..ఐదుగురు పాత్రికేయులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
గాజాలో మారణహోమం కొనసాగుతోంది. ఖాన్ యూనిస్‌లోని నాసెర్ ఆసుపత్రిపై సోమవారం ఇజ్రాయెల్ దాడి నిర్వహించగా, 20 మందికి మృతి చెందారు. వీరిలో ఐదుగురు జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య తీవ్ర ఘర్షణలు మొదలైనప్పటి నుంచి గాజాలో పనిచేస్తున్న 33 సంవత్సరాల మహిళా జర్నలిస్ట్ మరియం కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఏపీ వార్తా సంస్థకు సేవలు అందించేవారు. రాయిటర్స్,అల్-జజీరా, మిడిల్ ఈస్ట్ ఐ వంటి ప్రసిద్ధ వార్తా సంస్థలు తమ జర్నలిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారని ప్రకటించాయి.
వివరాలు
విషాదకరమైన దుర్ఘటనగా పేర్కొన్న ప్రధాని నెతన్యాహు
నాసెర్ ఆసుపత్రి దక్షిణ గాజాలో అతి పెద్ద వైద్య కేంద్రంగా ఉంది. ఈ దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించింది. అయితే, వారు పాత్రికేయులను లక్ష్యంగా చేసుకోలేదని, సంబంధం లేని వ్యక్తులకెవరికైనా హాని కలిగితే క్షమాపణలు చెబుతున్నామని తెలిపింది.ప్రధాని నెతన్యాహు ఈ ఘటనను ఒక విషాదకరమైన సంఘటనగా పేర్కొన్నారు.