NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Paetongtarn Shinawatra: ఆస్తులను ప్రకటించిన థాయ్‌లాండ్‌ ప్రధాని.. వాటి విలువ ఎంతంటే?
    తదుపరి వార్తా కథనం
    Paetongtarn Shinawatra: ఆస్తులను ప్రకటించిన థాయ్‌లాండ్‌ ప్రధాని.. వాటి విలువ ఎంతంటే?
    ఆస్తులను ప్రకటించిన థాయ్‌లాండ్‌ ప్రధాని.. వాటి విలువ ఎంతంటే?

    Paetongtarn Shinawatra: ఆస్తులను ప్రకటించిన థాయ్‌లాండ్‌ ప్రధాని.. వాటి విలువ ఎంతంటే?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 03, 2025
    05:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    థాయిలాండ్‌ ప్రధానిగా కొన్నినెలల క్రితం బాధ్యతలు చేపట్టిన పేటోంగ్టార్న్‌ షినవత్ర తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.

    ఆమెకు 400 మిలియన్ డాలర్ల (రూపాయల్లో సుమారు రూ.3,430 కోట్లు) విలువైన సంపద ఉన్నట్లు ప్రకటించారు.

    ఈ సంపదలో 75 లగ్జరీ వాచ్‌లు, 200 డిజైనర్ బ్యాగులు ఉన్నాయి.

    జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్‌ (NACC)కి ఆమె ఈ వివరాలు సమర్పించారు.

    ఈ మొత్తం 400 మిలియన్ డాలర్ల విలువ థాయ్ కరెన్సీలో సుమారు 13.8 బిలియన్ల బాత్‌లకు సమానం.

    ఆమె 5 బిలియన్ బాత్‌ను అప్పుల రూపంలో చూపించి, డిపాజిట్లు, నగదు రూపంలో 1 బిలియన్ బాత్‌ ఉన్నట్లు తెలిపారు.

    వీటితో పాటు, ఆమెకు లండన్‌, జపాన్‌లోనూ ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.

    వివరాలు 

    పేటోంగ్టార్న్‌ రెండవసారి థాయ్‌లాండ్‌ ప్రధానిగా బాధ్యతలు

    పేటోంగ్టార్న్‌ షినవత్ర, మాజీ ప్రధానిగా మారిన తక్సిన్‌ షినవత్ర చిన్న కుమార్తె. తక్సిన్‌ షినవత్ర తన కుటుంబం స్థాపించిన టెలికమ్యూనికేషన్ సంస్థ షిన్ కార్పొరేషన్ ద్వారా భారీ ఆస్తులు కూడబెట్టారు.

    ఆయన ఆస్తుల విలువ 2.1 బిలియన్ల డాలర్లు కాగా, ఆయన థాయ్‌లాండ్‌లో 10 మంది సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు.

    పేటోంగ్టార్న్‌ రెండవసారి థాయ్‌లాండ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మహిళగా గుర్తింపు పొందారు.

    ఆమె తండ్రి తక్సిన్‌ 2001లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, 2006లో సైనిక తిరుగుబాటుతో పదవీచ్యుతుడయ్యారు.

    పేటోంగ్టార్న్‌ 2011-14 మధ్యకాలంలో తన మేనత్త యింగ్లక్‌ షినవత్ర ప్రధానిగా ఉన్న సమయంలో కూడా రాజకీయ రంగంలో ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    థాయిలాండ్

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    థాయిలాండ్

    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి కరోనా కొత్త మార్గదర్శకాలు
    థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టు; చికోటి ప్రవీణ్ అరెస్టు భారతదేశం
    వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు  వాతావరణ మార్పులు
    Thailand visa free: ఇక వీసాకు పైసా చెల్లించకుండానే.. భారతీయులు థాయ్‌లాండ్‌కు వెళ్లొచ్చు  వీసాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025