Loading...
Pakistan Airstrike Afghanistan : ఆఫ్గాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. సరిహద్దు గ్రామాల్లో భయాందోళనలు
ఆఫ్గాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. సరిహద్దు గ్రామాల్లో భయాందోళనలు

Pakistan Airstrike Afghanistan : ఆఫ్గాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. సరిహద్దు గ్రామాల్లో భయాందోళనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 21, 2026
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

తూర్పు ఆఫ్గనిస్తాన్‌లోని సరిహద్దు ప్రాంతాలపై పాకిస్థాన్ వాయుసేన అర్ధరాత్రి సమయంలో వైమానిక దాడులు జరిపినట్లు సమాచారం. కునార్, పక్తికా ప్రావిన్స్‌లలోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ యుద్ధ విమానాలు బాంబులు జారవిడిచినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో సరిహద్దు గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కునార్ ప్రావిన్స్‌లోని నూర్గల్ జిల్లాలో ఉన్న పతంగ్ ప్రాంతంలో తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. పాక్ జెట్ విమానాలు చాలా తక్కువ ఎత్తులో అక్కడికి దూసుకొచ్చి బాంబులు వేసినట్లు స్థానికులు చెబుతున్నారు. పౌరుల నివాసాలపై బాంబులు పడటంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

వివరాలు 

పేలిన బాంబుల శకలాలను సేకరించిన స్థానికులు

ముఖ్యంగా నూర్గల్ జిల్లాకు చెందిన నూర్ మహమ్మద్ అనే పౌరుడి ఇంటిని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు తెలుస్తోంది.

బాంబుల ధాటికి ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమై మట్టిదిబ్బగా మారిపోయింది.

దాడి ప్రభావంతో పలువురు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించినట్లు సమాచారం.

అయితే దాడి జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది గాయపడ్డారు? ప్రాణనష్టం ఏమైనా జరిగిందా? ఆస్తి నష్టం ఎంత? అనే వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఘటన అనంతరం స్థానికులు అక్కడికి చేరుకుని పేలిన బాంబుల శకలాలను సేకరించారు.

వివరాలు 

పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు

గత కొంతకాలంగా పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే తాజా వైమానిక దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

ప్రజలు ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి జరిగిన ఈ హఠాత్ దాడులతో ఆఫ్గాన్ సరిహద్దు గ్రామాల్లో భయానక పరిస్థితి ఏర్పడింది.

ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

ముఖ్యంగా ప్రాణనష్టం, గాయపడిన వారి సంఖ్య, ఆస్తి నష్టం, దాడి జరిగిన ప్రాంతాల్లో జరిగిన విధ్వంసంపై అధికారికంగా మరింత సమాచారం అందాల్సి ఉంది.

ADVERTISEMENT