
Khawaja Asif: వెనక్కి తగ్గిన పాకిస్థాన్.. 'దాడులను ఆపండి.. మేము ఏమీ చేయము' పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం అర్ధరాత్రి పాకిస్థాన్, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని తొమ్మిది కీలక ప్రాంతాలపై వైమానిక దాడులు జరిపింది.
'ఆపరేషన్ సిందూర్'గా పేరుపెట్టిన ఈసైనిక చర్యలో జైష్-ఎ-మొహమ్మద్,లష్కరే-ఎ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలతో పాటు మొత్తం తొమ్మిది టార్గెట్లను భారత సైన్యం ధ్వంసం చేసింది.
ఈదాడిలో దాదాపు 90మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టు సమాచారం.
భారత వైమానిక దాడుల తర్వాత, యుద్ధానికి సిద్ధమని,అణ్వాయుధాలు ఉపయోగిస్తామని హెచ్చరిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు వెనక్కి తగ్గింది.
యుద్ధం ఆపండి మహా ప్రభో అంటూ భారత్ ముందు మోకరిల్లుతోంది.
పహల్గామ్ ఘటన అనంతరం భారత్ కీలక దౌత్యపరమైన చర్యలు చేపట్టగా,ఆ సమయంలో పాకిస్తాన్ నాయకత్వం ఓవర్‌కాన్ఫిడెన్స్ చూపించింది.
వివరాలు
భారతదేశం ఎటువంటి తదుపరి చర్య తీసుకోకపోతే..
అయితే ఇప్పుడు పాకిస్తాన్ పాలకుల మాటల్లో మౌనమే కనిపిస్తోంది.యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో,కాల్పుల విరమణను స్వయంగా ప్రకటించింది.
తమను తామే రక్షించుకుంటామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు.
ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,భారతదేశం ఎటువంటి తదుపరి చర్య తీసుకోకపోతే, మేము కూడా ఏమీ చేయమని తెలిపారు.
భారత్ వైమానిక దాడులకు తొలుత ఘాటుగా స్పందించిన ఖవాజా ఆసిఫ్,కొన్ని గంటల్లోనే తన మాటలను వెనక్కి తీసుకున్నాడు.
భారత విమానాలు పాకిస్తాన్ గగనతలాన్ని దాటి వచ్చి నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయని, దీనికి తగిన ప్రతిస్పందన ఇస్తామని ఆయన మొదట పేర్కొన్నారు.
కానీ,అనంతరం తన వ్యాఖ్యలను విరమించుకున్నాడు.భారత్ మరిన్ని చర్యలు తీసుకోకపోతే ,తాము ఏమీ చేయమని చెప్పాడు.