
Pakistan envoy: బంగ్లాదేశ్‌లో హనీట్రాప్ వివాదంలో పాక్ దౌత్యవేత్త.. అమ్మాయితో అశ్లీల వీడియోలు..
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా సేవలందిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ హనీట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు.
ఒక బంగ్లాదేశీ యువతితో ఆయనకు సంబంధించిన అనుచిత ఫొటోలు,వీడియోలు సోషల్ మీడియా వేదికలపై వైరల్‌గా మారాయి.
ఈ ఘటనపై అప్రమత్తమైన పాకిస్తాన్ విదేశాంగశాఖ ఆయనను తాత్కాలిక సెలవుపై పంపించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో పలు బంగ్లా మీడియా సంస్థలు ఈ అంశంపై కథనాలను ప్రచురించాయి.
కథనాల ప్రకారం,సయ్యద్ అహ్మద్ మరూఫ్ మే 11వ తేదీనే ఢాకా నగరాన్ని విడిచారు.
దుబాయ్ మార్గంగా ఆయన ఇస్లామాబాద్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. మరూఫ్ సెలవు గురించి పాకిస్తాన్ హైకమిషన్ బంగ్లాదేశ్ విదేశాంగశాఖకు అధికారిక సమాచారం ఇచ్చినప్పటికీ,సెలవుకు గల కారణం ఏమిటి? ఆయన ఎన్ని రోజులు సెలవులో ఉంటారు? వంటి విషయాలను మాత్రం వెల్లడించలేదు.
వివరాలు
మరూఫ్ స్థానంలో తాత్కాలికంగా డిప్యూటీ హైకమిషనర్ ఆసిఫ్
ఇదే సమయంలో, పాకిస్తాన్ విదేశాంగశాఖ కూడా ఈ వ్యవహారంపై ఎటువంటి ప్రకటన చేయలేదు.
మరూఫ్ స్థానంలో తాత్కాలికంగా డిప్యూటీ హైకమిషనర్ ఆసిఫ్ హైకమిషనర్ బాధ్యతలు స్వీకరించారు.
ఇటీవల ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైన వీడియోల్లో,బంగ్లాదేశీ యువతితో మరూఫ్ సన్నిహితంగా ఉన్న దృశ్యాలు కనిపించాయి.
వీటి ఆధారంగా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందని, ఆయన ఆ యువతివారి ప్రేమవలలో చిక్కుకున్నారని ప్రచారం జరుగుతోంది.
అంతేకాక, మరూఫ్ కీలకమైన నిఘా సమాచారం ఆమెతో పంచుకున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
ఇతర దేశాల మద్దతు కోసం ఎదురుచూస్తున్న పాకిస్తాన్..
ఇక భారత్‌తో ఇప్పటికే ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో, ఇతర దేశాల మద్దతు కోసం ఎదురుచూస్తున్న పాకిస్తాన్‌కు ఈ తరహా సంఘటనలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి.
గతంలో కూడా పాకిస్తాన్ గూఢచార కార్యకలాపాలపై ఆరోపణల నేపథ్యంలో, దిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఓ అధికారిని భారత ప్రభుత్వం అవాంఛిత వ్యక్తిగా (Persona Non Grata) ప్రకటించింది.
ఆ అధికారికి 24 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలంటూ గడువు విధించిన విషయం తెలిసిందే.