Indian Sailors: అరేబియా సముద్రంలో చిక్కుకున్న భారత నౌక.. సహాయం చేసిన పాకిస్థాన్ నౌకాదళం
ఈ వార్తాకథనం ఏంటి
అరేబియా సముద్రంలో ఇబ్బందుల్లో చిక్కుకున్న భారతీయ నావికాసిబ్బందికి పాకిస్థాన్ నౌకాదళం మానవతా దృష్టితో సహాయం అందించింది. ఈ సహాయక చర్యలను పాకిస్థాన్‌కు చెందిన సముద్ర భద్రతా సంస్థ నిర్వహించిందని రక్షణ శాఖ వర్గాల సమాచారాన్ని''డాన్''పత్రిక వెల్లడించింది. ముంబయిలోని సముద్ర సహాయ సమన్వయ కేంద్రం చేసిన విజ్ఞప్తి ఆధారంగా ఆరుగురు భారతీయులు,ఒక ఇండొనేసియా దేశస్థుడిని పాకిస్థాన్ సముద్ర భద్రతా సిబ్బంది రక్షించినట్టు సమాచారం. ఒమన్ దేశం నుంచి భారత్‌వైపు ప్రయాణిస్తున్న ఎంవీ గౌతమ్ నౌకలో సాంకేతిక లోపాలు ఏర్పడటంతో సిబ్బంది సహాయం కోరినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో అత్యవసర చర్యలు చేపట్టిన పాకిస్థాన్ సముద్ర భద్రతా సంస్థ,నౌకలో ఉన్న వారికి ఆహారం,ఔషధాలు అందించడంతో పాటు సాంకేతిక సహాయం కూడా కల్పించినట్టు వివరాలు వెల్లడించాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారత నావికులకు పాకిస్థాన్ మానవతా చర్యలు
📽️WATCH | Indian offshore vessel MV Gautam, stranded in the Arabian Sea due to a technical fault, received humanitarian assistance from the Pakistan Navy pic.twitter.com/0wecd9uaSl
— The Tatva (@thetatvaindia) May 6, 2026