LOADING...
Trump-Pak PM Meet:  ట్రంప్‌తో భేటీ అయ్యిన  పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా  
ట్రంప్‌తో భేటీ అయ్యిన పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా

Trump-Pak PM Meet:  ట్రంప్‌తో భేటీ అయ్యిన  పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2025
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా, పాకిస్థాన్‌ రోజురోజుకీ మరింత చేరువవుతున్నాయి. ఇటీవల పాకిస్థాన్‌ సైన్యాధిపతి జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ అగ్రరాజ్యంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆతర్వాత ఇప్పుడు పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ సమావేశం వైట్‌హౌస్‌లోని ఓవల్‌ ఆఫీసులో జరిగింది. షరీఫ్‌తో పాటు మునీర్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ భేటీకి మీడియాను అనుమతించకపోవడం గమనార్హం

వివరాలు 

 షరీఫ్ గొప్ప నేత, విశిష్ట వ్యక్తి

అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.52 గంటలకు పాకిస్తాన్‌ ప్రధాని షరీఫ్‌ నేతృత్వంలోని బృందం వైట్‌హౌస్‌కి చేరుకుంది. ఆ సమయంలో ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. దీంతో, పాకిస్తాన్‌ నేతలు దాదాపు ఒక గంటపాటు అధ్యక్షుడి కోసం ఎదురుచూశారు. అటు మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. షరీఫ్ గురించి ప్రస్తావించారు. ఆయనను ఒక గొప్ప నేత, విశిష్ట వ్యక్తిగా పేర్కొన్నారు. ఆ తర్వాత ట్రంప్‌ షరీఫ్‌తో ఓవల్‌ ఆఫీసులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ వ్యవహారాల మంత్రి మార్కో రూబియో కూడా పాల్గొన్నారు. అయితే, ఈ భేటీలో ఏం చర్చించారన్నదానిపై స్పష్టత లేదు.

వివరాలు 

షెహబాజ్‌ షరీఫ్‌ ట్రంప్‌తో భేటీ కావడం ఇది మొదటిసారి

ఇక , పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ట్రంప్‌తో భేటీ కావడం ఇది మొదటిసారి. దీని కంటే ముందుగా, 2019లో అప్పటి పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ 2015లో అమెరికా పర్యటన చేశారు. ఇంతకు మునుపు, పాకిస్తాన్‌ సైన్యాధిపతి మునీర్‌ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు, ఆయనకు వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం గమనార్హం. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న ఈ నేపథ్యంలో, ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.