Loading...
Pakistan Fatah-3: పాకిస్థాన్ ఫతా-3 క్షిపణి పరీక్ష సక్సెస్.. భారత్‌కు కొత్త ముప్పు?
పాకిస్థాన్ ఫతా-3 క్షిపణి పరీక్ష సక్సెస్.. భారత్‌కు కొత్త ముప్పు?

Pakistan Fatah-3: పాకిస్థాన్ ఫతా-3 క్షిపణి పరీక్ష సక్సెస్.. భారత్‌కు కొత్త ముప్పు?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని మరింత పెంచుకునే దిశగా కీలక ముందడుగు వేసింది. తాజాగా ఫతా-3 సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్థాన్ ఆర్మీ ప్రకటించింది. సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ క్షిపణికి ఉందని వెల్లడించింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తూ నిర్దేశించిన లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించగలదని పేర్కొంది. ఫతా-3ను తమ ఆయుధ సంపత్తిలో చేర్చుకోవడం ద్వారా దేశ రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమైందని పాకిస్థాన్ సైన్యం స్పష్టం చేసింది. అత్యాధునిక నేవిగేషన్ సాంకేతికతతో ఈ క్షిపణిని రూపొందించినట్లు పాకిస్థాన్ ఆర్మీ వెల్లడించింది. ఈ పరీక్షను ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ కమాండర్‌తో పాటు పాకిస్థాన్ సైన్యానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు,శాస్త్రవేత్తలు,ఇంజినీర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

వివరాలు 

పాక్ అధ్యక్షుడు, ప్రధాని అభినందనలు

వారి సమక్షంలోనే క్షిపణి పరీక్ష విజయవంతంగా పూర్తయినట్లు ప్రకటించారు.

ఫతా-3 క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు.

ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్,చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అసిమ్ మునీర్‌తో పాటు త్రివిధ దళాల అధిపతులు కూడా ఈ విజయంపై అభినందనలు తెలిపారు.

పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహ్సిన్ నఖ్వీ సైతం దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఫతా-3 పరీక్ష విజయవంతం కావడం పాకిస్థాన్ రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠంగా మార్చిందని ఆ దేశ నాయకత్వం పేర్కొంది.

దేశ రక్షణ రంగంలో ఇది కీలక మైలురాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడింది.ఈ వివరాలను పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ డాన్(Dawn)ప్రచురించింది.

వివరాలు 

వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న పాక్

పాకిస్థాన్ ఇటీవల కాలంలో వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది.అంతకుముందు ఫాజ్ పేరుతో దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.

పూర్తిగా స్వదేశీసాంకేతికతతో రూపొందించిన ఈ క్షిపణి ఎయిర్ టు ఎయిర్ విధానంలో లక్ష్యాలపై దాడి చేయగలదని వెల్లడించింది.

ఇక ఈఏడాది అక్టోబర్‌లోనూ పాకిస్థాన్ రెండు కీలక క్షిపణి పరీక్షలను పూర్తి చేసింది.

అక్టోబర్ 13న ఫతా-2 ఎక్స్‌టెండెడ్ రేంజ్ హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.

అంతకుముందు అక్టోబర్ 6న ఫతా-4గ్రౌండ్ లాంచ్డ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించింది.

తాజాగా ఫతా-3సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష కూడా విజయవంతం కావడంతో పాకిస్థాన్ క్షిపణి సామర్థ్యంపై చర్చ మొదలైంది.

ఈపరిణామాల నేపథ్యంలో భారత్ తన రక్షణ వ్యవస్థ విషయంలో అప్రమత్తంగా ఉన్నట్లు కథనంలో పేర్కొన్నారు.

ADVERTISEMENT