Fatah-IV cruise missile: ఫతహ్-4 క్రూజ్ క్షిపణిని పరీక్షించిన పాక్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఫతహ్-4 క్రూజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ఆ దేశ సైన్యం వెల్లడించింది. సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యంతో ఈ క్షిపణిని అభివృద్ధి చేసినట్లు తెలిపింది. గురువారం నిర్వహించిన ఈ పరీక్షను పాక్ రాకెట్ దళాల విభాగం చేపట్టినట్లు పాకిస్థాన్ సైనిక సమాచార విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. భూమి నుంచి ప్రయోగించే ఈ క్షిపణి వ్యవస్థలో ఆధునిక విద్యుత్ ఆధారిత దిశానిర్దేశ పరికరాలు అమర్చినట్లు వెల్లడించింది.
వివరాలు
దూర ప్రాంతాల్లోని లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం
వీటి సహాయంతో దూర ప్రాంతాల్లోని లక్ష్యాలను కూడా ఖచ్చితంగా చేరుకుని ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి ఉందని వివరించింది. సైనికుల యుద్ధ సామర్థ్యాన్ని పెంచడం, క్షిపణిలో అమర్చిన వివిధ సాంకేతిక భాగాల పనితీరును పరిశీలించడం లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు తెలిపింది. ఈ విజయవంతమైన పరీక్షపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.