Page Loader
Fatah missile: 120 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను పేల్చగల ఫ‌త‌హ్ క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్..
120 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను పేల్చగల ఫ‌త‌హ్ క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్..

Fatah missile: 120 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను పేల్చగల ఫ‌త‌హ్ క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్..

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2025
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ ఈరోజు ఫతహ్ క్షిపణిని పరీక్షించింది. ఈ మిస్సైల్ సుమారుగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణిగా వ్యవహరిస్తుంది.ఈ పరీక్ష గురించి పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ విభాగం అధికారికంగా సమాచారం విడుదల చేసింది. ఈ క్షిపణిలో అమర్చిన గైడెన్స్ సిస్టమ్‌ వలన రాకెట్ అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించేలా పనిచేస్తుంది. ఇక ట్రాజెక్టరీ మోడ్‌,టెర్మినల్ గైడెన్స్ టెక్నాలజీలు దీనిని యాంటీ బాలిస్టిక్ క్షిపణిలా స్పందించేలా తయారుచేశాయి. ఈ పరీక్షను పాకిస్థాన్ సీనియర్ ఆర్మీ అధికారుల సమక్షంలో ప్రత్యక్షంగా నిర్వహించారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో సైనిక విన్యాసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫ‌త‌హ్ మిస్సైల్‌ను ప‌రీక్షించిన పాకిస్థాన్‌..