LOADING...
Pakistan: పాకిస్థాన్‌లో ఐఈడీ పేలుడు.. గిరిజన తెగ నాయకుడు సహా ముగ్గురు మృతి
పాకిస్థాన్‌లో ఐఈడీ పేలుడు.. గిరిజన తెగ నాయకుడు సహా ముగ్గురు మృతి

Pakistan: పాకిస్థాన్‌లో ఐఈడీ పేలుడు.. గిరిజన తెగ నాయకుడు సహా ముగ్గురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
May 18, 2026
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ వాయవ్య ప్రాంతంలో సోమవారం జరిగిన ఐఈడీ పేలుడులో గిరిజన తెగ నాయకుడు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని దక్షిణ వజిరిస్తాన్ జిల్లాలోని వానా మార్కెట్ ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్‌ (IED) ద్వారా ఈ దాడి నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అహ్మద్‌జై తెగ పెద్ద ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు జిల్లా పోలీస్‌ చీఫ్‌ మహ్మద్ తాహిర్ మీడియాకు తెలిపారు.

వివరాలు 

దక్షిణ వజిరిస్తాన్ ప్రాంతం తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రం

మృతుల్లో ఆ తెగ నాయకుడు కూడా ఉన్నారు. దక్షిణ వజిరిస్తాన్ ప్రాంత జనాభాలో 60 శాతానికి పైగా అహ్మద్‌జై తెగవారే ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. అశాంతికి కేంద్రంగా పేరున్న దక్షిణ వజిరిస్తాన్ ప్రాంతం గతంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాక్‌లో బాంబు పేలుడు కలకలం.. నలుగురికి గాయాలు

Advertisement