NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Paul Alexander: ఇనుప ఊపిరితిత్తుల 'పోలియో పాల్' మృతి 
    తదుపరి వార్తా కథనం
    Paul Alexander: ఇనుప ఊపిరితిత్తుల 'పోలియో పాల్' మృతి 
    Paul Alexander: ఇనుప ఊపిరితిత్తుల 'పోలియో పాల్' మృతి

    Paul Alexander: ఇనుప ఊపిరితిత్తుల 'పోలియో పాల్' మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 14, 2024
    10:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చిన్నతనంలో పోలియో సోకి ఇనుప ఊపిరితిత్తులకే పరిమితమైన పాల్ అలెగ్జాండర్(Paul Alexander) డల్లాస్ ఆసుపత్రిలో సోమవారం 78 ఏళ్ల వయసులో మరణించినట్లు చిరకాల మిత్రుడు డేనియల్ స్పింక్స్ తెలిపారు.

    కోవిడ్ -19(covid-19) నిర్ధారణ అయిన తర్వాత అలెగ్జాండర్ ఇటీవల ఆసుపత్రిలో చేరాడని, అయితే మరణానికి కారణం తనకు తెలియదని ఆయన తెలిపారు.

    అలెగ్జాండర్ రోజులో కొంత భాగం తనంతట తానుగా ఊపిరి పీల్చుకోవడానికి శిక్షణ పొందగలిగాడు, అంతేకాకుండా లా డిగ్రీని కూడా సంపాదించాడు.

    తన జీవితం గురించి ఒక పుస్తకాన్ని వ్రాసాడు. సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నాడు. తన సానుకూల దృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించాడు.

    Details 

    పాల్‌కి మెకానికల్ ఊపిరితిత్తులు అమర్చిన డాక్టర్లు

    అలెగ్జాండర్ తన 6వ ఏట 1952లో పోలియో బారిన పడ్డాడు. అతను మెడ కింద నరాలు చచ్చుబడిపోయాయి. అతను స్వయంగా ఊపిరి పీల్చుకోలేని స్థితికి చేరాడు.

    ఆ తర్వాత టెక్సాస్ ఆస్పత్రి డాక్టర్లు పాల్‌కి మెకానికల్ ఊపిరితిత్తులను లోపల అమర్చారు.

    అప్పటి నుంచి దీని సాయంతో శ్వాస తీసుకుంటూ 70 ఏళ్లు గడిపారు.

    అతనికి టిక్‌టాక్ ఖాతాలో మిలియన్ల కొద్దీ వీక్షణలు ఉన్నాయి.

    అలెగ్జాండర్ తన జీవితం గురించి వ్రాసిన పుస్తకం, "త్రీ మినిట్స్ ఫర్ ఎ డాగ్: మై లైఫ్ ఇన్ యాన్ ఐరన్ లంగ్" 2020లో ప్రచురించబడింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     డల్లాస్ ఆసుపత్రిలో మృతి చెందిన పాల్ అలెగ్జాండర్

    Paul Alexander, who lived in an iron lung for more than 70 years after catching polio, has died at age 78. pic.twitter.com/Mx20EBtvx7

    — non aesthetic things (@PicturesFoIder) March 13, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచం

    తాజా

    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్
    Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్! బంగాళాఖాతం
    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్
    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం

    ప్రపంచం

    జర్మనీ: రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు: అధికారులు అలర్ట్  జర్మనీ
    అమెరికా: లహైనా నగరాన్నికమ్మేసిన కార్చిచ్చు: 67కు చేరిన మృతుల సంఖ్య  అమెరికా
    భారత క్రీడల అథారిటీ తీరుపై మండిపడ్డ దీపా కర్మాగార్.. న్యాయం జరగలేదని విమర్శలు స్పోర్ట్స్
    అమెరికాలో మనిషి మాంసాన్ని తీనేస్తున్న బ్యాక్టీరియా.. ఇప్పటికే ముగ్గురు మృతి! అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025