Aircraft Crash: రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
బ్రెజిల్‌లో విషాదకర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ చిన్న విమానం నేరుగా రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దక్షిణ బ్రెజిల్‌లో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. ఆరుగురితో ప్రయాణిస్తున్న చిన్న విమానం కాపావో డా కానావో విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. అయితే ఎగిరిన కొద్దిసేపటికే నియంత్రణ కోల్పోయిన విమానం రన్‌వే చివరన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లి కూలిపోయింది. ప్రమాదంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో పైలట్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
మరో ఇద్దరికి గాయాలు
అదే సమయంలో సమీపంలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో రెస్టారెంట్ మూసి ఉండటంతో మరింత ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అలాగే సమీప నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Donald J. Trump Truth Social 04:04.26 04:37 PM EST
— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) April 4, 2026
Many of Iran’s Military Leaders, who have led them poorly and unwisely, are terminated, along with much else, with this massive strike in Tehran! President DONALD J. TRUMP pic.twitter.com/kn2fwYTjjG