LOADING...
plane crash: కరెన్సీ నోట్లు తరలిస్తుండగా కుప్పకూలిన విమానం
కరెన్సీ నోట్లు తరలిస్తుండగా కుప్పకూలిన విమానం

plane crash: కరెన్సీ నోట్లు తరలిస్తుండగా కుప్పకూలిన విమానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2026
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

బొలీవియాలోని లా పాజ్‌ సమీపంలోని ఎల్‌ ఆల్టో నగరంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బొలీవియా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఒక విమానం, కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను ఇతర నగరాలకు తరలిస్తున్న సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మంది గాయపడ్డారు. ఈ విమానం శాంటాక్రూజ్‌ నుంచి బయలుదేరింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి పక్కకు జారుకుని, రద్దీగా ఉన్న రోడ్డుపైకి దూసుకెళ్లింది. దీని ఫలితంగా పలు వాహనాలను ఢీకొట్టింది. మృతుల్లో విమానంలోని ప్రయాణికులు మాత్రమే కాకుండా, రోడ్డుపై ఉన్న పౌరులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు ధ్రువీకరించారు.

Details

కొందరి పరిస్థితి విషమం

గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స ప్రారంభించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యుల నివేదికలు పేర్కొన్నాయి. దేశ రక్షణ మంత్రిత్వశాఖ అధికారుల వివరాలను ఆధారంగా, సెంట్రల్‌ బ్యాంక్‌ నుంచి కొత్తగా ముద్రించిన కరెన్సీని తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని మీడియా తెలిపింది. ఘటనా స్థలంలో అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ కారణంగా, ఎల్‌ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. విమానంలో ఉన్న కరెన్సీ నేలపై చెల్లాచెదురుగా విరిగి పడిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందాయి. అక్కడి స్థానికులు వాటిని సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నా, పోలీసులు వారిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు.

Advertisement