Loading...
Flydubai plane: ఫ్లైదుబాయ్‌ విమానంతో బిగ్‌ అటాక్‌ ప్లాన్‌.. టెల్‌అవీవ్‌లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టాలని కుట్ర!
ఫ్లైదుబాయ్‌ విమానంతో బిగ్‌ అటాక్‌ ప్లాన్‌.. టెల్‌అవీవ్‌లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టాలని కుట్ర!

Flydubai plane: ఫ్లైదుబాయ్‌ విమానంతో బిగ్‌ అటాక్‌ ప్లాన్‌.. టెల్‌అవీవ్‌లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టాలని కుట్ర!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2026
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్లైదుబాయ్‌ విమానంలో పైలట్‌పై దాడి ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానాన్ని ఇజ్రాయెల్‌ నగరం టెల్‌అవీవ్‌ గగనతలంలోకి తీసుకెళ్లి.. అక్కడి ఎత్తైన భవనాల్లో ఒకదాన్ని ఢీకొట్టి కూల్చివేయాలని కోపైలట్‌ హమామ్‌ అల్‌-హమ్మామీ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే బెన్‌గురియన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై విమానాన్ని కూల్చాలని అతడు భావించినట్లు సమాచారం. అయితే పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ ప్రాణాలకు తెగించి పోరాడటంతో కోపైలట్‌ ప్లాన్‌ విఫలమైంది. దీంతో విమానాన్ని ఎడారిలో కూల్చేందుకు హమ్మామీ ఇంజిన్లను నిలిపివేసి ఉండొచ్చని ఇజ్రాయెల్‌, ఇటలీ మీడియా సంస్థలు సంచలన కథనాలను ప్రచురించాయి.

వివరాలు

బెన్‌గురియన్‌ ఎయిర్‌పోర్టులో రెక్కీ

ఫ్లైదుబాయ్‌ సంస్థలో హమ్మామీ చేరిన తర్వాత ఇజ్రాయెల్‌లోని బెన్‌గురియన్‌ ఎయిర్‌పోర్టుకు పలు మార్లు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇటీవల జూన్‌లో అక్కడికి వెళ్లిన సమయంలో దాడికి అవసరమైన ఇంటెలిజెన్స్‌ సేకరించడానికే పూర్తి సమయం కేటాయించినట్లు సమాచారం.

జులైలోనే దాడికి ప్రయత్నించినప్పటికీ.. ఆ సమయంలో విమాన సిబ్బందిలో తన మిత్రుడు ఉండటంతో హమ్మామీ వెనక్కి తగ్గినట్లు కథనాలు పేర్కొన్నాయి.

ఈ ఘటనకు సంబంధించి విమాన సిబ్బందిని కూడా ప్రశ్నించాలని ఇజ్రాయెల్‌ డిమాండ్‌ చేస్తోంది.

వివరాలు

ఇంజిన్‌ స్విచ్‌లు ఆపివేశాడా..?

దుబాయ్‌ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్‌ అయిన తర్వాత కొద్దిసేపు కోపైలట్‌ హమామ్‌ అల్‌-హమ్మామీ సాధారణంగానే విధులు నిర్వర్తించాడు.

ఆ తర్వాత ప్రార్థన చేసుకుంటున్నట్లు నటించి.. పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌పై వెనుక నుంచి గొడ్డలితో దాడి చేసినట్లు తెలుస్తోంది.

మచ్చర్‌ను చంపేసి, టెల్‌అవీవ్‌లోని ఆకాశహర్మ్యాల్లో ఒకదాన్ని విమానంతో ఢీకొట్టి కూల్చివేయాలని అతడు ప్లాన్‌ చేసినట్లు ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలను ఉటంకిస్తూ ఓ కథనం పేర్కొంది.

దాడి జరిగే వరకు విమాన ప్రయాణం సజావుగానే సాగింది. తనపై అకస్మాత్తుగా జరిగిన దాడి నుంచి పైలట్‌ మచ్చర్‌ వెంటనే తేరుకున్నాడు.

కాక్‌పిట్‌ తలుపులు తెరిచేందుకు ప్రయత్నించాడు. అయితే కోపైలట్‌ దాడి కారణంగా అతడి ప్రయత్నం తొలుత విఫలమైంది.

ADVERTISEMENT

వివరాలు

మచ్చర్‌ తన ప్రయత్నాన్ని వదల్లేదు

అయినప్పటికీ తీవ్రంగా గాయపడిన మచ్చర్‌ తన ప్రయత్నాన్ని వదల్లేదు. చివరకు కాక్‌పిట్‌ డోర్‌ తెరుచుకుంది.

తన మొదటి ప్లాన్‌ విఫలం కావడంతో విమానాన్ని ఎడారిలో కూల్చేందుకు హమ్మామీ ఇంజిన్‌ స్విచ్‌లను ఆపివేసి ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో విమానం కేవలం సెకన్ల వ్యవధిలోనే 16 వేల అడుగుల కిందికి పడిపోయింది.

విమానం నేలను ఢీకొట్టే పరిస్థితి ఏర్పడటంతో.. అందులో ఉన్న ఇద్దరు ఆఫ్‌-డ్యూటీ పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. వారు విమానాన్ని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం సౌదీ అరేబియాలోని తబుక్‌ (Tabuk) విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు.

ADVERTISEMENT