LOADING...
PM Modi: భారత్ ఆర్థికంగా పురోగమిస్తోంది.. ఒమన్‌లో భారతీయ విద్యార్థులతో మోదీ సంభాషణ 
భారత్ ఆర్థికంగా పురోగమిస్తోంది.. ఒమన్‌లో భారతీయ విద్యార్థులతో మోదీ సంభాషణ

PM Modi: భారత్ ఆర్థికంగా పురోగమిస్తోంది.. ఒమన్‌లో భారతీయ విద్యార్థులతో మోదీ సంభాషణ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇది దేశ ప్రజలకు,భవిష్యత్తుకు పెద్ద సానుకూల సంకేతం అని ఆయన అన్నారు. ఒమన్ పర్యటనలో భారతీయ విద్యార్థులకు ప్రసంగిస్తున్న సందర్భంలో మోదీ ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు. మస్కట్‌లోని మైత్రి పర్వ్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విభిన్న సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో కూడా, భారత్ ఈ వేగవంతమైన అభివృద్ధిని సాధించడం విశేషమని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న మైత్రి సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని కూడా ఆయన తెలిపారు.

వివరాలు 

భారత్-ఒమన్ వ్యాపార సదస్సులో మోదీ

అంతకుముందు మస్కట్‌లో భారత్-ఒమన్ వ్యాపార సదస్సులో మోదీ ప్రసంగించారు. "మన దేశాల మధ్య సంబంధాలు విశ్వాస పునాదిపై స్థిరపడినవి. స్నేహ బలంపై మనం ముందుకు సాగాము. కాలక్రమేణా ఈ బంధం మరింత బలపడింది.నేడు మన దౌత్య సంబంధాలు 70సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి.ఇది కేవలం వేడుక మాత్రమే కాదు,ఇది ఒక మైలురాయి. మన శతాబ్దాల వారసత్వాన్ని ఒక సుసంపన్నమైన భవిష్యత్తు వైపు తీసుకువెళ్లాలి.''అని మోదీ ఆకాంక్షించారు. సముద్రం రెండు చివర్ల చాలా దూరంలో ఉంటాయని.. అయితే అరేబియా సముద్రం మాండవి.. మస్కట్‌ల మధ్య ఒక బలమైన వారధిగా నిలిచింది.ఈ వంతెన ద్వారా మన సంబంధాలు, సాంస్కృతిక,ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అయ్యాయి.సముద్రపు అలలు మారినప్పటికీ, భారతదేశం-ఒమన్ స్నేహం ప్రతి అలతో మరింత బలపడుతోంది,"అని మోదీ చెప్పారు.

వివరాలు 

అమెరికా, చైనా తర్వాత ఇది మూడో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం 

ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో సోమవారం జోర్డాన్ చేరారు.అక్కడ ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం ఇథియోపియాకు వెళ్లిన ఆయనకు అక్కడ కూడా గౌరవ మర్యాదలు దక్కాయి. ప్రస్తుతం ఒమన్‌లో ఉన్న మోడీ,మూడు దేశాల మధ్య బలమైన వాణిజ్య ఒప్పందాలను కుదిరాయని ఆయన తెలిపారు. అమెరికా, చైనా తర్వాత ఇది మూడో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కావడం విశేషం. బుధవారం ఒమన్ చేరుకున్న వెంటనే,ఉప ప్రధాని సయ్యిబ్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయిద్‌తో మోడీ సమావేశమై, ద్వైపాక్షిక,ప్రాంతీయ అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మైత్రి సంబంధాలను మరింత బలోపేతం చేసేదిశగా సమాలోచనలు జరిపారు. 70ఏళ్ల భారత్-ఒమన్ దౌత్య సంబంధాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను మోడీ తిలకించారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఒమన్‌లో భారతీయ విద్యార్థులతో మోదీ సంభాషణ 

Advertisement