LOADING...
Modi-Putin: అమెరికాలో మోదీ-పుతిన్ సెల్ఫీ వైరల్‌.. భారత్-రష్యా సాన్నిహిత్యంపై అగ్రరాజ్యం ఆందోళన
భారత్-రష్యా సాన్నిహిత్యంపై అగ్రరాజ్యం ఆందోళన

Modi-Putin: అమెరికాలో మోదీ-పుతిన్ సెల్ఫీ వైరల్‌.. భారత్-రష్యా సాన్నిహిత్యంపై అగ్రరాజ్యం ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2025
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన.. అమెరికా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ పర్యటన మోదీ-పుతిన్‌ల మధ్య ఉన్న స్నేహసంబంధాన్ని మరోసారి స్పష్టంగా ప్రతిబింబించింది. పుతిన్ భారత్‌కు చేరుకున్న వెంటనే మోదీ స్వయంగా స్వాగతం పలకడం, ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తుండగా తీసుకున్న సెల్ఫీ క్షణాల్లో వైరల్ అయింది. ఇప్పుడు అదే ఫొటో అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చలకు కేంద్రంగా మారింది.

వివరాలు 

మీకు నోబెల్ రాదంటూ ట్రంప్‌పై విమర్శలు చేసిన సిడ్నీ కమ్‌లాగర్ దువ్

ఒక్క చిత్రం అనేక సందేశాలు ఇస్తోందని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సిడ్నీ కమ్‌లాగర్ దువ్ వ్యాఖ్యానించారు. భారతపై ట్రంప్ ప్రభుత్వ వైఖరిని ఆమె ప్రశ్నిస్తూ, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా-భారత్‌ల మధ్య ఉన్న వ్యూహాత్మక నమ్మకం, పరస్పర అవగాహనకు నష్టం చేస్తున్నాయని తీవ్ర విమర్శలు చేసింది. ఇటువంటి విధానాలు అమెరికాకే దుష్పరిణామాలు తెచ్చిపెడతాయని ఆమె హెచ్చరించారు. "వ్యూహాత్మక భాగస్వాములను శత్రువుల వైపు మళ్లించడం ద్వారా నోబెల్ బహుమతి గెలవలేరు'' అంటూ ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైరల్ అయిన ఆ సెల్ఫీని ఉద్దేశించి, కనీసం ఇప్పటికైనా వాషింగ్టన్ తన వైఖరిని పునరాలోచించాలని ఆమె పిలుపునిచ్చారు.

వివరాలు 

అది మా స్నేహ బంధానికి సూచిక

2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌కు రావడం ఇదేతొలిసారి. ఢిల్లీలోనిపాలం విమానాశ్రయంలో ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించగా,మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. తరువాత ఇద్దరూ తమతమ కాన్వాయ్‌లను పక్కన పెట్టి, టయోటా ఫార్చ్యూనర్ వాహనంలో కలిసి ప్రధాని అధికారిక నివాసం వరకు ప్రయాణించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. "ఆకారులో ప్రయాణం నా ఆలోచన. అది మా స్నేహ బంధానికి సూచిక. మేం ఎప్పటికప్పుడూ ఏదో ఒక అంశంపై చర్చిస్తూనే ఉంటాం''అని పుతిన్ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. రష్యా చమురు మీద ఆధారపడుతున్న భారత్‌పై అమెరికా భారీసుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం. అమెరికా ప్రవర్తనే.. భారత్‌ను రష్యా వైపునకు నెట్టివేస్తోందని సిడ్నీ విమర్శించారు.

Advertisement