LOADING...
PM Modi: న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..

PM Modi: న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2026
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం న్యూజిలాండ్‌లోని ఆర్థిక రాజధాని ఆక్లాండ్‌కు చేరుకున్నారు. అక్కడికి స్వయంగా వచ్చిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని పరస్పరం అభివాదాలు చేసుకున్నారు. ఆక్లాండ్‌లో తనకు లభించిన ఘన స్వాగతానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలను ప్రధాని మోదీ 'ఎక్స్‌' వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. ఆక్లాండ్ విమానాశ్రయంలో స్వయంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

వివరాలు 

57 శాతం వస్తువులపై దిగుమతి సుంకాలు విధించమని ప్రకటించిన న్యూజిలాండ్ ప్రభుత్వం

దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని న్యూజిలాండ్‌ను సందర్శించడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడిందని మోదీ పేర్కొన్నారు. భారత్-న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ న్యూజిలాండ్ చేరుకునే ముందే ఆ దేశ ప్రభుత్వం భారత్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు న్యూజిలాండ్ నుంచి ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల్లో 57 శాతం వస్తువులపై ఇకపై ఎలాంటి దిగుమతి సుంకాలు విధించబోమని న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు మరింత ఊతమివ్వనుందని భావిస్తున్నారు.

Advertisement