Haitian PM resigns: హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ రాజీనామా
హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని గయానా అధ్యక్షుడు, కరేబియన్ కమ్యూనిటీ (CARICOM) ప్రస్తుత చైర్మన్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ధృవీకరించారు. ఈ మేరకు ఆయన రాజీనామాను ఆమోదించినట్లు స్పష్టం చేశారు. ఆలాగే, కొత్త ప్రధాని వచ్చే వరకు ఏరియల్ హెన్రీ ఆ పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. ఏరియల్ హెన్రీ, 74, CARICOM నాయకుల తరపున హైతీలో పరిస్థితిపై అత్యవసర శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించిన తర్వాత తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. ప్రధాని ఏరియల్ హెన్రీకి వ్యతిరేకంగా హైతీలో అంతర్యుద్ధం మొదలైంది. తిరుగుబాటుదారుల నిరసనలకు తలొగ్గిన ప్రధాని చివరికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.