Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యంపై వాటికన్ కీలక ప్రకటన..
ఈ వార్తాకథనం ఏంటి
వాటికన్ పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసింది. స్వల్పంగా కిడ్నీ సమస్య తలెత్తిందని, దీని కారణంగా ఆయన శరీరం చికిత్సకు పూర్తిగా స్పందించడం లేదని పేర్కొంది.
ప్రస్తుతం ఆయన గొట్టం ద్వారా ఆక్సిజన్ అందుకుంటున్నారని వెల్లడించింది. పోప్ ఫ్రాన్సిస్‌ను మంచి దృక్పథం కలిగిన వ్యక్తిగా వాటికన్ అభివర్ణించింది.
ప్రస్తుతం పోప్ ఫ్రాన్సిస్ వృద్ధాప్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక ఆస్తమా,శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు.
ఈ నెల 14న ఆరోగ్య సమస్యల కారణంగా రోమ్‌లోని జెమెల్లి ఆస్పత్రిలో చేరారు.
అప్పటి నుంచి వైద్యులు నిరంతరం చికిత్స అందిస్తున్నప్పటికీ, ఆయన శరీరం దానికి పూర్తి సహకారం అందించడం లేదని వాటికన్ పేర్కొంది.
వివరాలు
ముదిరిన ఊపిరితిత్తుల సమస్యలు
గత శనివారం ఆయన ఆరోగ్యం మరింత విషమించిందని, ఆదివారం కూడా పరిస్థితి మారలేదని వెల్లడించింది. శనివారం రెండు యూనిట్ల రక్త మార్పిడి కూడా జరిగినట్లు సమాచారం.
పోప్ ఫ్రాన్సిస్ 2013 నుంచి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
చిన్నతనంలోనే ఫ్లూరిసీ వ్యాధి బారిన పడటంతో, ఊపిరితిత్తులలో ఒక భాగాన్ని తొలగించాల్సి వచ్చింది.
దీంతో ఊపిరితిత్తుల సమస్యలు ముదిరాయి.
అదనంగా రక్తహీనత సమస్యతో ప్లేట్‌లేట్ కౌంట్ తగ్గిపోవడంతో రక్త మార్పిడి చేయాల్సి వచ్చింది. దీనితో ఆయన ఆరోగ్యం కొంత స్థిరపడినట్లు వాటికన్ తెలిపింది.