Pope Francis: బ్రోన్కైటిస్‌తో రోమ్ ఆసుపత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్..
ఈ వార్తాకథనం ఏంటి
పోప్ ఫ్రాన్సిస్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 88 సంవత్సరాలు.
చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన కిందపడిపోయి గాయాలపాలయ్యారు.
ఈ సంఘటనలకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
తాజాగా, మరోసారి ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, హుటాహుటిన రోమ్‌లోని ఆసుపత్రికి తరలించారు.
రెగ్యులర్ వైద్యపరీక్షలు , బ్రోన్కైటిస్ చికిత్స కోసం పోప్ ఫ్రాన్సిస్ ఆసుపత్రిలో చేరిన విషయాన్ని వాటికన్ సిటీ శుక్రవారం ధృవీకరించింది.
ఫిబ్రవరి 6న ఆయనకు బ్రోన్కైటిస్ ఉందని నిర్ధారణ అయ్యింది. అయినప్పటికీ, తన నివాసమైన కాసా శాంటా మార్టాలో క్రమంగా విధులు నిర్వహిస్తూ, ఆదివారం ప్రార్థన కార్యక్రమాలకు అధ్యక్షత వహించారు.
వివరాలు
వీల్‌చైర్‌కే పరిమితం
పోప్ ఫ్రాన్సిస్ చాలా కాలంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.యవ్వనంలో ఉన్నప్పుడు ఆయన ఊపిరితిత్తుల్లో ఒక భాగాన్ని తొలగించారు.
ముఖ్యంగా శీతాకాలంలో తీవ్రమైన బ్రోన్కైటిస్‌తో తరచుగా బాధపడుతూ వస్తున్నారు.
ప్రస్తుతం ఆయన వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు.
ఇటీవల రెండు సార్లు ఆయన పడిపోవడంతో, చెయ్యి విరిగింది, గడ్డం దగ్గర గాయాలయ్యాయి. ప్రస్తుతం పోప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.