
Pope Francis: అంత్యక్రియలకు ముందు.. సెయింట్ పీటర్స్ బసిలికాకు పోప్ ఫ్రాన్సిస్ భౌతికకాయం
ఈ వార్తాకథనం ఏంటి
క్యాథలిక్ క్రైస్తవుల మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ సోమవారం కన్నుమూశారు.
ఆయన స్ట్రోక్‌కు గురవడమేగాక,గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు వాటికన్‌లోని వైద్య నిపుణులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో, ప్రజలకు సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని సెయింట్ పీటర్స్ బసిలికాకు తరలించారు.
అక్కడ మూడు రోజులపాటు ఆయనకు నివాళులర్పించేందుకు ప్రజలకు అవకాశం ఇవ్వనున్నారు.
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల నిర్వహణపై చర్చించేందుకు మంగళవారం ఉదయం రోమ్‌లో కార్డినల్స్ సమావేశమయ్యారు.
రోమ్‌లో అందుబాటులో ఉన్న కార్డినల్స్ ఈ సమావేశానికి హాజరై, పోప్ భౌతికదేహాన్ని ఎప్పటికి సెయింట్ పీటర్స్ బసిలికాలో ఉంచాలి, అంత్యక్రియలు ఎప్పుడెప్పుడు నిర్వహించాలనే విషయాలపై చర్చించారు.
వివరాలు
శనివారం ఉదయం 10 గంటలకు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు
ఈ సమావేశంలో బుధవారం నుంచి ప్రజల సందర్శనార్థం సెయింట్ పీటర్స్ బసిలికాలో పోప్ భౌతికకాయాన్ని ఉంచాలనే నిర్ణయం తీసుకున్నారు.
దానికి అనుగుణంగా, మంగళవారం ఆయన నివాసమైన వాటికన్ సిటీ నుంచి భౌతికకాయాన్ని సెయింట్ పీటర్స్ బసిలికాకు తరలించారు.
ఇక పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు శనివారం ఉదయం 10 గంటలకు (ఇటలీ సమయానుసారం) నిర్వహించనున్నట్టు అధికారికంగా వెల్లడించారు.