NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Punjab Woman : న్యూజెర్సీలో పంజాబీ మహిళపై కాల్పులు జరిపిన గౌరవ్ గిల్‌
    తదుపరి వార్తా కథనం
    Punjab Woman : న్యూజెర్సీలో పంజాబీ మహిళపై కాల్పులు జరిపిన గౌరవ్ గిల్‌
    Punjab Woman : న్యూజెర్సీలో పంజాబీ మహిళపై కాల్పులు జరిపిన గౌరవ్ గిల్‌

    Punjab Woman : న్యూజెర్సీలో పంజాబీ మహిళపై కాల్పులు జరిపిన గౌరవ్ గిల్‌

    వ్రాసిన వారు Stalin
    Jun 18, 2024
    10:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలోని న్యూజెర్సీలోని మిడిల్‌సెక్స్ కౌంటీలో జరిగిన కాల్పుల్లో భారత సంతతి మహిళ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

    నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని భారతీయ సంతతికి చెందిన 19 ఏళ్ల గౌరవ్ గిల్‌గా గుర్తించారు.

    టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, మరణించిన మహిళ పంజాబ్‌కు చెందినవారు.తుపాకీ కాల్పుల సమాచారంపై పోలీసులు స్పందించారు.

    బుధవారం (జూన్ 14) ఇద్దరు మహిళలను గుర్తించేందుకు వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

    బాధితులిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో విమానంలో ఆస్పత్రికి తరలించారు. జస్వీర్ కౌర్(29), గాయాలతో మరణించగా..ఆమె 20 ఏళ్ల బంధువు పరిస్థితి విషమంగా ఉంది.

    వివరాలు 

    అనుమానితుడు గౌరవ్ గిల్ అరెస్టు 

    గౌరవ్ గిల్ అనే అనుమానితుడిని అదే రోజు అరెస్టు చేశారు. పరారీలో గంటల తర్వాత,అతను షూటింగ్ సైట్ నుండి అర మైలు దూరంలో ఉన్న పెరట్లో చెట్లమాటున దాగి వుండగా అరెస్ట్ చేశారు.

    కెంట్ నివాసి అయిన గిల్,ఫస్ట్-డిగ్రీ హత్య,హత్యాయత్నం,అనేక ఆయుధ సంబంధిత నేరాలతో సహా పలు ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.

    మహిళలపై హత్యాయత్నం జరిగిన ఇల్లు గురుముఖ్ సింగ్‌కు చెందినది. కౌర్‌ ఆయన నివాసంలో పని చేస్తున్నారు.కాల్పులకు కారణాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి .

    బాధితులతో గిల్‌కి ముందస్తు సంబంధం ఉందా లేదా అనేది తెలియదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    న్యూజెర్సీ

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    న్యూజెర్సీ

    అమెరికా: న్యూజెర్సీ రెస్టారెంట్‌లో 'మోదీ జీ థాలీ'; ఆ వంటకం ప్రత్యేకలు ఇవే  నరేంద్ర మోదీ
    ఇంటి అద్దెకు భయపడి విమానంలో ఆఫీసుకు వెళ్తున్న యువతి అమెరికా
    FBI's 'most wanted:న్యూజెర్సీలో అదృశ్యమైన భారతదేశ యువతి.. $10,000 రివార్డ్ ప్రకటించిన FBI  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025