పుతిన్‌ను అరెస్టు చేసే ఉద్దేశం మాకు లేదు: బ్రెజిల్ అధ్యక్షుడు
వచ్చే ఏడాది బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో జీ20 సదస్సు జరగనుంది. అయితే ఈ సమ్మిట్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్భయంగా రావొచ్చని ఆ దేశ అధ్యక్షుడు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా అన్నారు. ఆయన వస్తే తాము అరెస్టు చేయబోమని, ఆ ఉద్దేశం తమకు లేదన్నారు. జీ20 సమావేశంలో పాల్గొనేందుకు దిల్లీకి వచ్చిన ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. వచ్చే ఏడాది జరిగే ఈవెంట్‌కు పుతిన్‌ను ఆహ్వానిస్తామన్నారు. అలాగే రియో సమావేశానికి ముందు రష్యాలో జరగనున్న అభివృద్ధి చెందుతున్న దేశాల బ్రిక్స్ కూటమి సమ్మిట్‌కు కూడా తాను హాజరవుతానని స్పష్టం చేశారు.
ఐసీసీ అరెస్టు వారెంట్‌తో అంతర్జాతీయ ఈవెంట్లకు దూరంగా పుతిన్
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఈ ఏడాది మార్చిలో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఐసీసీలో భాగమైన దేశాల్లో పుతిన్ కాలు మోపితే ఆయన్ను అరెస్టు చేస్తారు. ఉక్రెయిన్ నుంచి వందలాది మంది పిల్లలను చట్టవిరుద్ధంగా అక్రమంగా తరలించారని, రష్యా బలగాలు యుద్ధనేరాలకు పాల్పడినట్లు పుతిన్‌పై ఐసీసీ అభియోగాలు మోపింది. అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో మార్చి నుంచి పుతిన్ అంతర్జాతీయ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. అందులో భాగంగానే దిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశానికి హాజరుకాలేదు. ఐసీసీలో భాగమైన బ్రెజిల్ సారథ్యంలో 2024లో జీ0 సదస్సు జరగనున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు ఇనాసియో తాజా ప్రకటన ఆసక్తికరంగా మారింది.