Page Loader
Rahul Gandi: అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ.. ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తాం
అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ.. ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తాం

Rahul Gandi: అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ.. ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తాం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2024
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖ నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటన ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించారు. డల్లాస్‌లో ప్రవాస భారతీయులు, ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ సభ్యుల నుంచి లభించిన స్వాగతం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Details

విద్యావేత్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ చేపట్టిన ఇదే తొలి అమెరికా పర్యటన కావడం విశేషం. ఈ పర్యటనలో సెప్టెంబర్ 8న డల్లాస్‌లో, 9-10 తేదీల్లో వాషింగ్టన్‌ డీసీలో ఆయన పర్యటించనున్నారు. విద్యావేత్తలు, జర్నలిస్టులు, థింక్‌ ట్యాంక్‌ ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలతో రాహుల్‌ గాంధీ భేటీ కానున్నారు. అలాగే టెక్సాస్‌ యూనివర్శిటీలో విద్యార్థులు, విద్యావేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన వాషింగ్టన్‌ డీసీలోని క్యాపిటల్ హిల్‌లో పలువురి ప్రముఖులతో సమావేశం కానున్నారు.