LOADING...
US: యూఎస్‌లో భారతీయుల రికార్డు అడ్మిషన్స్.. వరుసగా రెండో ఏడాది అగ్రస్థానం
యూఎస్‌లో భారతీయుల రికార్డు అడ్మిషన్స్.. వరుసగా రెండో ఏడాది అగ్రస్థానం

US: యూఎస్‌లో భారతీయుల రికార్డు అడ్మిషన్స్.. వరుసగా రెండో ఏడాది అగ్రస్థానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2025
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో భారతదేశం వరుసగా రెండో సంవత్సరంలో కూడా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 2024-25 విద్యా సంవత్సరంలో మొత్తం 3,63,019 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నారని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది 3,31,602 మంది నుండి ఇది 9.5% వృద్ధిగా నమోదు అయ్యింది. ముఖ్యంగా యూజీ కోర్సులు, ఓపీటీ (OPT) ప్రోగ్రామ్‌లలో భారతీయుల సంఖ్య భారీగా పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణం.

Details

భారత్ మరోసారి చైనాను అధిగమించింది

తాజాగా విడుదలైన ఓపెన్ డోర్స్ 2025 రిపోర్ట్ ప్రకారం, అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థులను అత్యధికంగా పంపుతున్న దేశంగా భారత్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 11,77,766 అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయుల వాటా 30.8%గా ఉంది. చైనా నుంచి విద్యార్థుల రాక తగ్గుదలలోనే ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్న చైనా నుంచి విద్యార్థుల రాక నిరంతరం పడిపోతుంది. 2024-25లో చైనా నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థులు 2,65,919 మాత్రమే. ఇది గత ఏడాదితో పోల్చితే 4% తగ్గుదల, అలాగే గత ఎనిమిదేళ్లలో ఇదే అత్యల్ప సంఖ్య. భారత్-చైనా కలిపి మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో 53.4% వాటాను కలిగి ఉన్నాయి.

Details

 అమెరికాలో భారతీయుల భారీ వృద్ధికి ప్రధాన కారణాలు

1. యూజీ కోర్సుల్లో పెరుగుదల అండర్‌గ్రాడ్యుయేట్ ప్రవేశాలు 11.3% పెరిగి, 36,053 నుంచి 40,135కు చేరాయి. 2. ఓప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)లో గణనీయ వృద్ధి ఉద్యోగ ఆధారిత శిక్షణకు పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా OPTలో పాల్గొనే భారతీయుల సంఖ్య 47.3% పెరిగి, 97,556 నుంచి 1,43,740కు చేరింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల్లో మూడింట ఒక వంతుకు పైగా ఓపీటీ చేస్తున్నవారే.

Details

 అయితే PG ప్రవేశాలు తగ్గుముఖంలో

భారతీయుల సంఖ్య మొత్తం పెరిగినా గ్రాడ్యుయేట్ (PG) కోర్సుల్లో 9.5% తగ్గుదల కనిపించింది. 1,96,567 నుంచి ఈ సంఖ్య 1,77,892కు పడిపోయింది. అదేవిధంగా నాన్-డిగ్రీ కోర్సుల్లో కూడా 12.2% తగ్గుదల నమోదైంది. IIE వివరణ ప్రకారం, గత మూడు సంవత్సరాల్లో గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య భారీగా పెరగడంతో, వారిలో చాలామంది ఇప్పుడు OPTకి అర్హత సాధించి ఆ దిశగా వెళ్లడం వలన ఈ సంవత్సరం PG ప్రవేశాలు తగ్గినట్లు కనిపిస్తున్నాయన్నారు. అయినప్పటికీ, ఈ సంఖ్య ఇప్పటికీ గతంలోని కంటే ఎక్కువ స్థాయిలోనే ఉందని పేర్కొన్నారు.

Details

కొత్త ప్రవేశాల్లో పడిపోవడం ఆందోళనకరం

అమెరికా ఇప్పటికీ అంతర్జాతీయ విద్యార్థులకు ప్రధాన గమ్యస్థానమే అయినా వీసా అనిశ్చితులు పెరగడం వల్ల ఫాల్ 2025లో మొదటిసారి చేరిన విద్యార్థుల సంఖ్య 17% తగ్గినట్టు ప్రారంభ సూచనలు చెబుతున్నాయి. ఫాల్ 2024లో కూడా కొత్త ప్రవేశాలు 7.2% తగ్గాయి. అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో 57% మంది STEM ప్రోగ్రామ్‌ల్లో ఉన్నారు. మొత్తం అమెరికన్ ఉన్నత విద్యా సంస్థల విద్యార్థుల్లో అంతర్జాతీయ విద్యార్థుల వాటా కేవలం 6% మాత్రమే.