
Lord Hanuman: టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో సుమారు 90 అడుగుల ఎత్తు గల హనుమాన్ విగ్రహాన్ని ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ విగ్రహాన్ని సుఘర్ ల్యాండ్ పట్టణంలోని శ్రీ అష్టలక్ష్మీ ఆలయ పరిసరాల్లో, చిన్నయజీయర్ స్వామి ఆధ్వర్యంలో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో స్థాపించారు. అయితే ఈ విగ్రహ ఏర్పాటుపై టెక్సాస్ రిపబ్లికన్ పార్టీ నేత అలెగ్జాండర్ డంకన్ అసహనం వ్యక్తం చేశారు. అమెరికా దేశం క్రైస్తవుల దేశం కాబట్టి, హిందువులు ఆరాధించే దేవుడు నకిలీ అని, ఆ విగ్రహాన్ని ఎందుకు టెక్సాస్‌లో ఏర్పాటు చేశారో ప్రశ్నించారు. డంకన్ తన ఎక్స్ అకౌంట్‌లో ఈ విషయాన్ని పోస్టు చేశారు
Details
డంకన్ వ్యాఖ్యలను ఖండించిన హిందూ అమెరికన్ ఫౌండేషన్
అలాగే సుఘర్ ల్యాండ్‌లో ఉన్న విగ్రహానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. మరొక సోషల్ మీడియా పోస్టులో డంకన్ బైబిల్ సూక్తిని ఉదహరించారు. నేను తప్ప మరొక భగవంతుడు మీకు లేరని, ఎవరూ మరొకరి విగ్రహాన్ని ఏర్పాటు చేయరాదని బైబిల్‌లో చెప్పారని ఆయన చెప్పారు. డంకన్ వ్యాఖ్యలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) ఖండించింది. హిందువులపై వ్యతిరేక, రెచ్చగొట్టే రీతిలో ఉన్నట్లు హెచ్చరించింది. టెక్సాస్‌లోని రిపబ్లికన్ పార్టీకి ఫిర్యాదులు కూడా చేశామనిని పేర్కొన్నారు.
Details
హిందువులకి గౌరవం ఇవ్వాలి
అమెరికా రాజ్యాంగం ఏ మతాన్నైనా అవలంబించే స్వేచ్ఛను అందిస్తున్నందున హిందువులకి గౌరవం ఇవ్వాలని తెలిపారు. అలాగే ఓ ఎక్స్ యూజర్ డంకన్ వ్యాఖ్యలను సవాలుచేసారు. "మీరు హిందువు కాకపోతే, దేవుడు తప్పు కాదు" అని అన్నారు. భూమిపై యేసుక్రీస్తు పుట్టడానికి 2,000 సంవత్సరాల ముందే వేదాలను రాసారు, అవి అసాధారణ గ్రంధాలు, వాటి ప్రభావం క్రైస్తవులపై ఉంది. అందుకే ఆ మతానికి ప్రాధాన్యత ఇవ్వడం, దాన్ని అధ్యయనం చేయడం మంచిదని తెలిపారు.