Page Loader
పారిస్ ఫ్యాషన్ వీక్‌: 368 వజ్రాలు పొదిగిన వాచ్‌ను ధరించిన రిహన్నా; ధర ఎంతంటే? 
పారిస్ ఫ్యాషన్ వీక్‌: 368 వజ్రాలు పొదిగిన వాచ్‌ను ధరించిన రిహన్నా; ధర ఎంతంటే?

పారిస్ ఫ్యాషన్ వీక్‌: 368 వజ్రాలు పొదిగిన వాచ్‌ను ధరించిన రిహన్నా; ధర ఎంతంటే? 

వ్రాసిన వారు Stalin
Jun 22, 2023
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న ఫ్యాషన్‌కు ఇచ్చే ప్రాధాన్యత అంతా, ఇంతా కాదు. తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్‌‌లో మెడకు ధరించిన డైమండ్ చోకర్‌ వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ గడియారం చట్టూ వజ్రాలు పొదిగిన దాని ధర తెలిస్తే అవాక్కవాల్సిందే. మొత్తం 368 వజ్రాలను అమర్చి, చోకర్‌గా ధరించడానికి వీలుగా దీన్ని తీర్చిదిద్దారు. దాదాపు రూ. 5.7 కోట్ల విలువైన జాకబ్ & కో వాచ్‌ని ధరించి రిహన్నా తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. జాకబ్ & కోతో ఉన్న ఒప్పందం మేరకు రిహన్నా వాచ్‌ను మెడకు ధరించిన ప్రదర్శించింది. మెడకు పెట్టుకునే వాచ్‌ను తయారు చేయేడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

పారిస్

బేబి బంప్‌తో మెరిసిపోయిన రిహన్న 

రిహన్న రెండోసారి తల్లి కాబోతోంది. పారిస్ ఫ్యాషన్ వీక్‌ బేబి బంప్‌ను కూడా ప్రదర్శించింది. డెనిమ్ షర్ట్, జీన్స్, భారీ జాకెట్, బీనీని ధరించిన తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది. ఈ క్రమంలో రిహన్న మెరిసే హీల్స్‌తో మెడలో డైమండ్ నెక్లెస్‌తో పాటు జాకబ్ & కోతో చోకర్ వాచ్‌తో పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిపోయింది. తన జీవిత భాగస్వామి రాకీతో రిహన్న ఫ్యాషన్ వీక్‌కు హాజరైంది. రిహన్న, రాకీ 2020నుంచి డేటింగ్ చేస్తున్నారు. అదే సంవత్సరం నవంబర్‌లో వీడి సహజీవనాన్ని బహిర్గతం చేశారు. ఏప్రిల్ 2022లో రాకీ-రిహన్న విడిపోయారని ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత అది అబద్ధమని తేలింది. ఈ జంట మే 2022లో తమ మొదటి సంతానానికి జన్మనిచ్చారు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

రిహన్న పోస్ట్ చేసిన సెల్ఫీ