Romania: అవిశ్వాస తీర్మానంతో కుప్పకూలిన రొమేనియా అనుకూల కూటమి ప్రభుత్వం
వ్రాసిన వారు
Sirish Praharaju
May 06, 2026
12:57 pm
ఈ వార్తాకథనం ఏంటి
రొమేనియాలో యూరోపియన్ యూనియన్‌కు మద్దతు ఇస్తున్న కూటమి ప్రభుత్వం కూలిపోయింది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతం కావడంతో ప్రధానమంత్రి ఇలీ బొలొజన్ నాయకత్వంలోని ప్రభుత్వం రాజీనామా చేసింది. ఈ తీర్మానానికి అనుకూలంగా మొత్తం 281 మంది సభ్యులు ఓటు వేయగా, వ్యతిరేకంగా కేవలం నలుగురే నిలిచారు. కేవలం ఏడాది క్రితం ఏర్పడిన ఈ ప్రభుత్వం ఇంత త్వరగా కూలిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వివరాలు
అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అలయెన్స్ ఫర్ ది యూనిటీ ఆఫ్ రొమేనియన్స్ పార్టీ
ఇటీవల అధికార కూటమిలో భాగమైన సోషల్ డెమోక్రాటిక్ పార్టీ తన మద్దతును ఉపసంహరించుకోవడం రాజకీయ పరిణామాలకు దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అలయెన్స్ ఫర్ ది యూనిటీ ఆఫ్ రొమేనియన్స్ పార్టీ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే, ఈ తీర్మానం నిజమైనది కాదని, రాజకీయ కపటం మాత్రమేనని ప్రధానమంత్రి బొలొజన్ విమర్శించారు.