Loading...
Balendra Shah India Visit: వరద పునర్నిర్మాణానికి రూ.18 వేల కోట్లు.. భారత్ పర్యటనలో నేపాల్ ప్రధాని కీలక అజెండా!
వరద పునర్నిర్మాణానికి రూ.18 వేల కోట్లు.. భారత్ పర్యటనలో నేపాల్ ప్రధాని కీలక అజెండా!

Balendra Shah India Visit: వరద పునర్నిర్మాణానికి రూ.18 వేల కోట్లు.. భారత్ పర్యటనలో నేపాల్ ప్రధాని కీలక అజెండా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్ ప్రధాని బాలేంద్ర షా తన తొలి ద్వైపాక్షిక భారత పర్యటనను మూడు రోజుల నుంచి సుమారు 25 గంటలకు కుదించుకున్నారు. వరదల పునరావాసం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భారత్ నుంచి 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.18 వేల కోట్లు) ఆర్థిక ప్యాకేజీని పొందాలని నేపాల్ భావిస్తోంది. ఈ అంశమే ఆయన పర్యటనలో ప్రధాన అజెండాగా ఉండనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బాలేంద్ర షా భారత్‌లో పర్యటించనున్నారు. నవంబర్ 22 మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకోనున్న ఆయన.. నవంబర్ 23 సాయంత్రం ఖాట్మండుకు తిరిగి వెళ్లనున్నారు. తొలుత మూడు రోజుల పాటు పర్యటన ఉండేలా ప్రణాళిక రూపొందించినప్పటికీ, తాజాగా దాన్ని సుమారు 25 గంటలకు పరిమితం చేశారు.

వివరాలు

ఢిల్లీకి మాత్రమే పరిమితమైన పర్యటన

పర్యటన షెడ్యూల్‌లో మార్పుల కారణంగా బాలేంద్ర షా పర్యటన న్యూఢిల్లీకి మాత్రమే పరిమితం కానుంది.

తొలుత ప్రతిపాదించిన బెంగళూరు, అహ్మదాబాద్, ఉత్తరాఖండ్ పర్యటనలను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో భారత్, నేపాల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.

వివరాలు

రూ.18 వేల కోట్ల ఆర్థిక సాయం కోరనున్న నేపాల్

ఈ పర్యటనలో భారత్ నుంచి 2 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని నేపాల్ కోరనున్నట్లు సమాచారం.

ఇందులో 1 బిలియన్ డాలర్లను రాయితీ రుణాల రూపంలో, 500 మిలియన్ డాలర్లను గ్రాంట్ల రూపంలో అందించాలని ప్రతిపాదించనుంది.

మరో 500 మిలియన్ డాలర్లను ఆగస్టు 26న సంభవించిన తీవ్ర వరదల అనంతర పునర్నిర్మాణ పనుల కోసం కోరనుంది.

వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల పునరుద్ధరణతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ఆర్థిక సాయం ఉపయోగపడుతుందని ఖాట్మండు భావిస్తోంది.

ఈ అంశంపై ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు

భారత గగనతలంపై నేపాల్ విజ్ఞప్తి

తన అంతర్జాతీయ విమానాశ్రయాలకు భారత గగనతలం ద్వారా మెరుగైన విమాన రాకపోకల సదుపాయం కల్పించాలని కూడా నేపాల్ కోరనుంది.

దీనితో పాటు జలవిద్యుత్ రంగంలో సహకారం, రవాణా అనుసంధానం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న ద్వైపాక్షిక ప్రాజెక్టులపైనా ఇరు దేశాలు చర్చించనున్నాయి.

ADVERTISEMENT