LOADING...
Rubio Meets Modi: భారత్‌-అమెరికా సంబంధాలపై చర్చలు.. మోదీని కలిసిన రూబియో
భారత్‌-అమెరికా సంబంధాలపై చర్చలు.. మోదీని కలిసిన రూబియో

Rubio Meets Modi: భారత్‌-అమెరికా సంబంధాలపై చర్చలు.. మోదీని కలిసిన రూబియో

వ్రాసిన వారు Jayachandra Akuri
May 23, 2026
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌కు చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీ సేవా తీర్థ్‌ (పీఎంవో)లో జరిగిందిగా, సుమారు గంటకు పైగా చర్చలు కొనసాగినట్లు సమాచారం. భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో భారత్‌, అమెరికాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు నాయకులు చర్చించినట్లు భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. అదేవిధంగా స్వేచ్ఛాయుత, సమగ్ర ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా ఫలవంతమైన చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు.

వివరాలు

మిషనరీస్ ఆఫ్ ఛారిటీని సందర్శించిన  మార్కో రూబియో

శనివారం ఉదయం అమెరికా నుంచి నేరుగా కోల్‌కతాకు చేరుకున్న మార్కో రూబియో.. మిషనరీస్ ఆఫ్ ఛారిటీను సందర్శించారు. మదర్ థెరిసా స్థాపించిన ఈ సేవా సంస్థలో ఆయన తన సతీమణి జీనెట్‌తో కలిసి పర్యటించి థెరీసాకు నివాళులర్పించారు. అనంతరం ఆమె సేవా తత్వాన్ని ప్రశంసిస్తూ 'ఎక్స్‌' వేదికగా పోస్ట్‌ చేశారు. భారత్‌ పర్యటనలో భాగంగా మే 26న దిల్లీలో నిర్వహించనున్న క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా రూబియో పాల్గొననున్నారు. ఈ కూటమిలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికా దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి.

Advertisement