Page Loader
Russia: ఉక్రెయిన్‌పై 300కుపైగా డ్రోన్లతో రష్యా దాడి!
ఉక్రెయిన్‌పై 300కుపైగా డ్రోన్లతో రష్యా దాడి!

Russia: ఉక్రెయిన్‌పై 300కుపైగా డ్రోన్లతో రష్యా దాడి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2025
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాల్పుల విరమణ కోసం ఒకవైపు మంతనాలు జరుగుతుండగా, మరోవైపు రష్యా ఉక్రెయిన్‌పై దాడులు ఆపకుండా కొనసాగిస్తోంది. తాజాగా మాస్కో బలగాలు కీవ్ నగరంపై దాదాపు 300కు పైగా డ్రోన్లు, 30 క్షిపణులతో విరుచుకుపడ్డాయని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో నివాస భవనాలు, ఆస్పత్రులు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బహుళ భవనాలు శిథిలాలుగా మారిపోయాయి. శిథిలాల కింద చాలా మంది పౌరులు చిక్కుకున్నారని, వారిని బయటకు తీసేందుకు భద్రతా దళాలు రాత్రింబవళ్లు సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి తగిన వైద్యాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఇక ఉక్రెయిన్‌లోని ఒడెసా నగరంపై కూడా రష్యా దళాలు 20కు పైగా డ్రోన్లు, అనేక క్షిపణులు ప్రయోగించాయి.

Details

 మిత్రదేశాలకు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు 

ఈ దాడుల్లో ఒకరు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. యుద్ధ ప్రభావంతో భారీ ఆస్తినష్టం సంభవించింది. అలాగే ఈశాన్య సుమీ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలు నాశనమయ్యాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో తమ దేశానికి మద్దతుగా నిలుస్తున్న మిత్రదేశాలకు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయుధాల సరఫరా చేసి తమకు అండగా ఉన్న దేశాల సహకారం మర్చిపోలేనిదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సహాయం ముఖ్యంగా గమనార్హం. రష్యా దాడుల మధ్య ఉక్రెయిన్‌ను బలపరిచేందుకు ఆస్ట్రేలియా కీవ్‌కు M1A1 అబ్రమ్స్ ట్యాంకులను శనివారం పంపించింది. మరిన్ని ఆయుధాలు, రక్షణ సామగ్రిని రాబోయే నెలల్లో పంపనున్నట్లు ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ప్ర కటించారు.