Loading...
Russia-Ukraine Peace Talks: శాంతి చర్చలకు ముందు రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడులు
శాంతి చర్చలకు ముందు రష్యా,ఉక్రెయిన్ మధ్య దాడులు

Russia-Ukraine Peace Talks: శాంతి చర్చలకు ముందు రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2026
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది. ఇరు దేశాలు నౌకలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నాయి. నల్ల సముద్రంలో ఓ కార్గో నౌక, చమురు ట్యాంకర్‌పై దాడి చేసినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టుకు తూర్పు వైపున ఉన్న మరో కార్గో నౌకను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మరోవైపు, ఉక్రెయిన్ డ్రోన్లతో జరిపిన దాడుల కారణంగా రష్యా ఆధీనంలోని తూర్పు ప్రాంతమైన లుహాన్స్క్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.

వివరాలు 

అబుదాబిలో తొలి శాంతి చర్చలకు ముందు ఉద్రిక్తతలు

రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య అబుదాబిలో తొలిసారిగా జరగనున్న త్రైపాక్షిక శాంతి చర్చలకు ముందు ఈ దాడులు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశం.

యుద్ధం తర్వాత భూభాగాల పంపకానికి సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు కొంత సానుకూలత చూపుతున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు.

అయితే, కీలక అంశాలపై ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

వివరాలు 

చర్చల్లో ప్రధాన అడ్డంకులివే!

శాంతి చర్చల్లో ప్రధాన సమస్యగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల భవిష్యత్తు, ముఖ్యంగా డొనెట్స్క్ అంశం నిలిచింది.

ప్రస్తుతం తమ ఆధీనంలో ఉన్న డొనెట్స్క్‌లోని కొన్ని ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాలని రష్యా కోరుతోంది.

అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న సరిహద్దుల వద్దే యుద్ధాన్ని నిలిపివేయాలని ఉక్రెయిన్ పట్టుబడుతోంది.

అమెరికా ప్రతినిధి బృందంలో సభ్యుడైన జారెడ్ కుష్నర్ ఈ అంశంపై స్పందించారు.

యుద్ధం ముగిసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉండాలనే దానిపై అన్ని పక్షాలు తీవ్రంగా ఆలోచించేలా ప్రోత్సహించడం ఈ ప్రక్రియలో కీలకమైన భాగమని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT