Loading...
Trump: ప్రపంచ మార్కెట్ల కోసమే రష్యా నుంచి డీజిల్ కొనుగోలు.. ట్రంప్ కొత్త వివరణ
ప్రపంచ మార్కెట్ల కోసమే రష్యా నుంచి డీజిల్ కొనుగోలు.. ట్రంప్ కొత్త వివరణ

Trump: ప్రపంచ మార్కెట్ల కోసమే రష్యా నుంచి డీజిల్ కొనుగోలు.. ట్రంప్ కొత్త వివరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2026
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కుదుర్చుకున్న డీజిల్ కొనుగోళ్ల ఒప్పందంపై సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేయడం అమెరికా కోసం కాదని, ప్రపంచ మార్కెట్లను స్థిరీకరించేందుకేనని ఆయన చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

ప్రధాన రాజకీయ అంశంగా ఇంధన ధరల పెరుగుదల

''అదొక డీజిల్ ఒప్పందం. అది మనకోసం కాదు.. ప్రపంచం కోసం'' అని ట్రంప్ మీడియాతో అన్నారు.

అధిక ఇంధన ధరలతో ఒత్తిడికి గురవుతున్న అంతర్జాతీయ మార్కెట్లను స్థిరీకరించేందుకు రష్యా రిఫైనరీల నుంచి వచ్చే ఇంధనాన్ని ఉపయోగించనున్నట్లు వివరించారు.

నవంబరులో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరల పెరుగుదల అక్కడ ప్రధాన రాజకీయ అంశంగా మారింది.

ఈ పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

రష్యా డీజిల్‌పై ఉన్న ఆంక్షలను 2027 ఏప్రిల్ వరకు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఈ నిర్ణయంపై చర్చ మొదలైంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఇటీవల ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

వివరాలు 

ఈ ఒప్పందంపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు

తొలుత మూడు లక్షల టన్నులకు పైగా డీజిల్‌ను రష్యా తక్షణమే అమెరికాకు, అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేసేలా చర్చల్లో ఒప్పందం కుదిరిందని ట్రంప్ తెలిపారు.

నవంబరులో మరో ఐదు లక్షల టన్నులు, ఆ తర్వాత వెంటనే అదనంగా పది లక్షల టన్నుల డీజిల్‌ను మాస్కో సరఫరా చేస్తుందని పేర్కొన్నారు.

అనంతరం రష్యా డీజిల్ రిఫైనరీల పరిస్థితులను బట్టి తక్కువ వ్యవధిలోనే మరో 30 లక్షల టన్నుల వరకు ఇంధనాన్ని అందించే అవకాశం ఉందని వెల్లడించారు.

అయితే, ఈ ఒప్పందంపై ట్రంప్ సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT