LOADING...
Moscow car bomb: మాస్కోలో పేలిన కారుబాంబు.. రష్యా కీలక సైనిక అధికారి మృతి
మాస్కోలో పేలిన కారుబాంబు.. రష్యా కీలక సైనిక అధికారి మృతి

Moscow car bomb: మాస్కోలో పేలిన కారుబాంబు.. రష్యా కీలక సైనిక అధికారి మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 22, 2025
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా రాజధాని మాస్కోలో సోమవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. నగరంలో జరిగిన కారు బాంబు పేలుడులో రష్యాకు చెందిన ఓ కీలక సైనిక ఉన్నతాధికారి మృతి చెందారు. ఈ విషయాన్ని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఆ రష్యా సైనికాధికారి పేరు లెఫ్టినెంట్ జనరల్‌ ఫానిల్ సర్వరోవ్‌. ఆయన సాయుధ దళాల ఆపరేషనల్ ట్రైనింగ్ విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నివాస అపార్ట్‌మెంట్ సమీపంలోని కార్ పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన ఆయన వాహనం కింద అమర్చిన పేలుడు పరికరం అకస్మాత్తుగా పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది.

వివరాలు 

రోజురోజుకు పెరుగుతున్న రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు

ఈ దాడి వెనుక ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ పాత్ర ఉండవచ్చని రష్యా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. 2022 నుంచి రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుండగా, యుద్ధాన్ని ఆపేందుకు ఒకవైపు చర్చలు సాగుతున్నప్పటికీ, మరోవైపు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల కాస్పియన్ సముద్రంలో ఉన్న రష్యాకు కీలకమైన చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసింది. భవిష్యత్తులో మరిన్ని దాడులు చేస్తామని కూడా ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ పరిస్థితుల నడుమ మాస్కోలో జరిగిన తాజా కారు బాంబు పేలుడు ఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ జనరల్

Advertisement