LOADING...
H-1B visa:'అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వండి.. తరువాత తిరిగి వెళ్లిపోండి': కొత్త H-1B వీసాపై అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు 
కొత్త H-1B వీసాపై అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు

H-1B visa:'అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వండి.. తరువాత తిరిగి వెళ్లిపోండి': కొత్త H-1B వీసాపై అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి హెచ్‌-1బీ వీసా అంశం తరచుగా చర్చకు వస్తోంది. తాజాగా ఈ వీసావిధానంపై అమెరికా ఆర్థికశాఖమంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకారం,అమెరికన్లకు శిక్షణ ఇవ్వడం కోసం తాత్కాలికంగా హెచ్‌-1బీ ఉద్యోగాలను ఇస్తున్నామని తెలిపారు. "అమెరికన్లకు నైపుణ్యం నేర్పండి,ఆపై విదేశీయులు తిరిగి తమ దేశాలకు వెళ్లిపోవచ్చు.చివరికి అన్ని ఉద్యోగాలను అమెరికన్లే చేపడతారు"అనే విధానమే ట్రంప్ ప్రభుత్వ కొత్త దృష్టికోణమని ఆయన పేర్కొన్నారు. "విదేశీ కార్మికులపై దీర్ఘకాలంగా ఆధారపడకుండా,అధిక నైపుణ్యం ఉన్న ఉద్యోగాలను అమెరికన్లు పొందేలా వారికి శిక్షణ ఇవ్వడం మా లక్ష్యం.అందుకోసం తాత్కాలికంగా నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను అమెరికాకు తీసుకురావడం ఈ కొత్త విధానం సారాంశం"అని వివరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు