
John F. Kennedy: అమెరికా మాజీ అధ్యక్షుడు కెన్నడీ హత్యపై రహస్య పత్రాలు రిలీజ్.. నిజాలు వెలుగు చూస్తాయా?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ (John F. Kennedy) హత్య వెనుక జరిగిన నిజాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. అయిత, అగ్రరాజ్యం ఈ విషయాలను బయటపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది.
అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు కెన్నడీ హత్య కేసుకు (Kennedy Assassination) సంబంధించిన రహస్య దస్త్రాలను ఇటీవల బహిర్గతం చేసింది.
యూఎస్ నేషనల్ ఆర్కీవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ వీటిని తన అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.
Details
80,000 కీలక దస్త్రాలను విడుదల
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ఈ చర్య ద్వారా గరిష్ఠ పారదర్శకతతో కూడిన కొత్త శకానికి నాంది పలికారని యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యానించారు.
ఎలాంటి మార్పులు చేయకుండా కెన్నడీ హత్య కేసు సంబంధిత రహస్య దస్త్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలగామని వెల్లడించారు.
కెన్నడీ మరణానికి సంబంధించిన దాదాపు 80,000 కీలక దస్త్రాలను విడుదల చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఈ హత్య కేసులో తాజాగా ఎఫ్‌బీఐ సుమారు 2,400 కొత్త రికార్డులను గుర్తించినట్లు వెల్లడించింది.
Details
కెన్నడీ హత్య వివరాలు
1961లో జాన్ ఎఫ్. కెన్నడీ అమెరికా 35వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 43 ఏళ్ల వయసులో ఆ పదవిని అధిరోహించిన అతిపిన్న వయస్కుడిగా అరుదైన ఘనత సాధించారు.
1963 నవంబరు 22న టెక్సాస్ పర్యటనలో ఉండగా ఆయనపై కాల్పులు జరిగాయి. కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ దుండగుడు వెనక నుంచి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో కెన్నడీ ప్రాణాలు కోల్పోయారు.
ఈ హత్య కేసులో లీ హార్వే ఓస్వాల్డ్ అనే వ్యక్తిని తొలుత అరెస్టు చేశారు. ఆ ఓస్వాల్డ్‌ను మరో దుండగుడు కాల్చి చంపాడు.
ఓస్వాల్డ్‌ను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి శిక్ష విధించగా, అతను క్యాన్సర్‌తో మరణించాడు.
ఈఘటన జరిగినప్పటి నుంచి కెన్నడీ హత్య రహస్యంగా మిగిలిపోయింది.