Iran: అమెరికా మిత్రదేశాల ట్యాంకర్లపై సెక్యూరిటీ డ్యూటీలు.. ఇరాన్ కొత్త వ్యూహం
ఈ వార్తాకథనం ఏంటి
చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ కొత్త చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా మిత్ర దేశాలకు చెందిన చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలపై సెక్యూరిటీ డ్యూటీలు విధించేందుకు ఇరాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అధికార వర్గాలను ఉటంకిస్తూ ఈ వివరాలు వెలుగులోకొచ్చాయి. ఆ కథనాల ప్రకారం పర్షియన్ గల్ఫ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా మిత్ర దేశాలకు చెందిన చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలపై భద్రతా రుసుములు విధించాలని ఇరాన్ అధికారులు యోచిస్తున్నారు.
details
హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఆ దేశం ప్రకటన
ఇప్పటికే హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చమురు ధరలను కూడా తామే నియంత్రించగలమని ఇరాన్ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధంలో ఓటమిని అంగీకరించే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని వారు వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హర్మూజ్ జలసంధిలో చమురు సరఫరాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇప్పటివరకు ఎదుర్కొన్న దానికంటే 20 రెట్లు ఎక్కువగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన హెచ్చరించారు.
Details
అలాంటి పరిస్థితి రావాలని తాను కోరుకోవడం లేదు
అవసరమైతే ఆ దేశాన్ని తిరిగి పునర్నిర్మించుకోలేని విధంగా ధ్వంసం చేయగలమని ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు. అయితే అలాంటి పరిస్థితి రావాలని తాను కోరుకోవడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి మార్గంగా చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే దేశాలకు ఇది తాము ఇస్తున్న 'గిఫ్ట్' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.